అక్షరటుడే,ఎల్లారెడ్డి: DLDO Officers Issues | డీఎల్డీవోల సమస్యలపై సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) అన్నారు.
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల పశుసంవర్ధక అభివృద్ధి అధికారులు (డీఎల్డీఓలు) ఎమ్మెల్యేను కలువగా ఆయన స్పందించారు.
DLDO Officers Issues | డీఎల్డీవో పోస్టు ప్రాధాన్యత..
ఈ సందర్భంగా డీఎల్డీవో పోస్టు ప్రాధాన్యతను, పశుసంవర్ధక రంగంలో ఏఎల్పీ సంస్కరణల అమలులో ఆ పోస్టు పోషిస్తున్న కీలక పాత్రను ఎమ్మెల్యేకు వివరించారు. స్టేట్ ట్రెజరీ కార్యాలయం (ఎస్టీఓ) ద్వారా అందుతున్న వాహన అలవెన్స్ కొన్ని నెలలకు మాత్రమే పరిమితమవుతోందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. విధుల నిర్వహణలో ఎదురవుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రతి నెలా క్రమం తప్పకుండా వాహన అలవెన్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎల్డీవో పోస్టు ప్రాధాన్యతను గుర్తించి, సంబంధిత సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు ఎమ్మెల్యేను అభ్యర్థించారు. దీనిపై ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సానుకూలంగా స్పందించారు. అధికారుల సమస్యలను ముఖ్యమంత్రితో చర్చిస్తానని, అవసరమైతే అసెంబ్లీలోనూ ఈ అంశాలను ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: Telangana Power Cuts | విద్యుత్ కోతలకు సీఎం వైఫల్యమే కారణం..: కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్