అక్షరటుడే, ఇందూరు: BJP Kisan Morcha Cycle Rally | మోసపూరిత హామీలిచ్చిన కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచిందని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ(MLA Dhannpal Suryanarayana) ఆరోపించారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర మంగళవారం నిజామాబాద్ అర్బన్‌కు (Nizamabad) చేరుకోగా ఎమ్మెల్యే స్వయంగా సైకిల్ తొక్కారు.
BJP Kisan Morcha Cycle Rally | వరంగల్ డిక్లరేషన్ సాక్షిగా..
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ సాక్షిగా రైతులకు అనేక హామీలు ఇచ్చి ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, భూమిలేని రైతు కూలీలకు 12 వేల ఆర్థిక సాయం, క్వింటాలుకు 500 బోనస్ ఇస్తామని చెప్పి విస్మరించిందన్నారు. కేవలం రైతులనే కాకుండా మహిళలకు, యువతీ యువకులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఎల్ నినో ప్రభావం రాష్ట్రం పై తీవ్రంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన పట్టించుకోలేదన్నారు. సమయం దాటిన తర్వాత ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పడం విడ్డూరమన్నారు. అప్పటికే రైతులు వరి వేసుకున్నారని గుర్తు చేశారు. ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన అంటూ లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
BJP Kisan Morcha Cycle Rally | కేంద్రం ఇచ్చిన వాటాను..
కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాల్లో తన వాటాన్ని ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తామే చేస్తున్నట్లు ప్రచారం చేయడం సిగ్గుచేటని ధన్పాల్ అన్నారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పార్లమెంట్ పరిధిలో బోధన్ నుంచి జగిత్యాల వరకు 320 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ చేపట్టడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, హరీష్ రెడ్డి, సుగంధం హరీష్, పద్మా రెడ్డి, కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, బంటు రాము, మల్కాయి మహేందర్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, ఓబీసీ మోర్చరాష్ట్ర ప్రతినిధి స్వామి యాదవ్, మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు మారెడ్డి వనిత, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు జస్పాల్ సింగ్, యువ మోర్చ రాష్ట్ర సహా కోశాధికారి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: డిగ్రీ ఉందా ? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా ఎలా నమోదు చేసుకోవాలి?