అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BJYM District Secretary | బీజేవైఎం (BJYM Nizamabad) జిల్లా కార్యదర్శిగా దేవానాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
BJYM District Secretary | నమ్మకంతో పనిచేస్తా..
జిల్లాలో నా సేవలను గుర్తించి బీజైవైఎం కార్యదర్శిగా అధిష్టానం పదవి కట్టబెట్టిందని దేవానాయక్ అన్నారు. పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తానని.. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన ఎంపీ అర్వింద్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఎమ్మెల్యేలు ధన్పాల్, పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి: శిలా తోరణం వరకు.. తిరుమలలో భక్తుల రద్దీ