Pitru Paksha Vastu | పితృ పక్షంలో ఈ తప్పులు చేస్తున్నారా? అయితే దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు పక్కా

హిందూ సంప్రదాయంలో పితృ పక్షాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణాలు, పిండ ప్రదానాలు చేసే ఈ 16 రోజుల పవిత్ర కాలం సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమైంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Pitru Paksha Vastu | హిందూ సంప్రదాయంలో పితృ పక్షాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణాలు, పిండ ప్రదానాలు చేసే ఈ 16 రోజుల పవిత్ర కాలం సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమైంది. అయితే, ఈ పితృ పక్షాల సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే పితృ దోషాలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే కొన్ని పనికిరాని వస్తువులు ప్రతికూల శక్తిని పెంచుతాయని, కాబట్టి వాటిని వెంటనే ఇంటి నుంచి తొలగించాలని నిపుణులు చెబుతున్నారు.

Pitru Paksha Vastu | విరిగిన విగ్రహాలు..

చాలామంది ఇంట్లో పూజా మందిరంలో దేవుడి విగ్రహాలు విరిగిపోయినా లేదా పాడైపోయినా అలాగే ఉంచేస్తుంటారు. వాస్తు ప్రకారం ఇది అస్సలు మంచిది కాదు. ఇంట్లో విరిగిన విగ్రహాలు ఉండటం వల్ల ప్రతికూల శక్తి విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల మనం ఎంత పూజ చేసినా దాని ఫలితం దక్కదని పండితులు చెబుతున్నారు. కాబట్టి మీ ఇంట్లో అలాంటి విగ్రహాలు ఉంటే వెంటనే తొలగించి పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలి.

Pitru Paksha Vastu | పనిచేయని గడియారాలు..

ఇంట్లో గోడకు తగిలించిన గడియారాలు  ( Clocks )ఆగిపోయినా లేదా పాడైపోయినా వాటిని అలాగే వదిలేస్తుంటారు. ఇది ఇంట్లోకి దురదృష్టాన్ని తెస్తుందని వాస్తు శాస్త్రం స్పష్టం చేస్తోంది. పనిచేయని గడియారాలు ఉంటే కుటుంబ సభ్యులకు వృత్తి, వ్యాపారాలలో తీవ్రమైన అడ్డంకులు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు. కాబట్టి వాటిని వెంటనే రిపేర్ చేయించాలి లేదా బయట పడేయాలి.

Pitru Paksha Vastu | చిరిగిన బట్టలు..

వంటగదిలో లేదా ఇంట్లో పగిలిన గాజు సామాన్లు, పగుళ్లు వచ్చిన పింగాణీ లేదా ఇతర పాత్రలను వాడటం వల్ల వాస్తు దోషాలు కలుగుతాయి. అలాగే ఇంట్లో ఎవరూ వాడని చిరిగిన పాత బట్టలను కూడా ఎక్కువ రోజులు ఉంచుకోవడం మంచిది కాదు. ఇవి ఇంట్లో దరిద్రానికి, అనవసర ఖర్చులకు కారణమవుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి పితృ పక్షాల వేళ ఇలాంటి అనవసర వస్తువులను ఏరిపారేయడం మంచిది.

ఇది కూడా చదవండి:  BJYM District Secretary | బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా దేవానాయక్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *