Supreme Court Student Protest | సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన.. మేజిస్ట్రేట్ తీరుపై సీరియస్

ఢిల్లీ జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థుల ఆందోళనకు సంబంధించి గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ విద్యార్థికి నోటీసులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Supreme Court Student Protest | ఢిల్లీ జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థుల ఆందోళనకు సంబంధించి గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ విద్యార్థికి నోటీసులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యార్థులపై ఎలాంటి బలవంతపు లేదా శిక్షాత్మక చర్యలు తీసుకోవద్దని సెప్టెంబర్ 1న తాము స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, గ్రేటర్ నోయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసులు ఇవ్వడాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ కేసును విచారించింది. నోయిడా పోలీసుల సమాచారం ఆధారంగానే ఓ మేజిస్ట్రేట్ ఈ నోటీసులు జారీ చేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. జంతర్‌మంతర్‌లో కాక్‌రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో ఇతర విద్యార్థులు పాల్గొనేలా ఆ విద్యార్థి ప్రోత్సహించాడనే ఆరోపణలతో ఈ నోటీసులు ఇచ్చినట్లు వివరించారు.

Supreme Court Student Protest |  ఆదేశాలను ఉల్లంఘణ..

ఈ వ్యవహారంపై సీజేఐ సూర్యకాంత్  ( Surya Kant )తీవ్రంగా మండిపడ్డారు. “ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని మేము స్పష్టంగా చెప్పాం. ఏ మేజిస్ట్రేట్ కూడా మా ఆదేశాలను ఉల్లంఘించలేరు. మా ఆదేశాల్లోని భాష అత్యంత స్పష్టంగా ఉన్నప్పటికీ, ఇలాంటి చర్యలు ఎలా జరిగాయి?” అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నోటీసును గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా యంత్రాంగం తర్వాత ఉపసంహరించుకున్నట్లు న్యాయవాది తెలిపారు. అయితే దీనిపై స్పందించిన జస్టిస్ బాగ్చి.. నోటీసు అధికారిక ఉపసంహరణకు సంబంధించి ఎలాంటి స్పష్టత ఉందంటూ నిలదీశారు. కేవలం మీడియా కథనాల ద్వారానే తనకు ఈ విషయం తెలిసిందని, అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని న్యాయవాది సమాధానం ఇచ్చారు.

Supreme Court Student Protest | విద్యార్థుల హక్కులపై తీవ్ర ప్రభావం..

దేశవ్యాప్తంగా విద్యార్థుల హక్కులపై తీవ్ర ప్రభావం చూపే ఈ అంశంపై కోర్టు ధిక్కరణ కోణంలో విచారణ జరిపిన ధర్మాసనం, తదుపరి వివరాలపై దృష్టి సారించింది. విద్యార్థులపై అనవసరమైన చర్యలు తీసుకోవద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్థానిక యంత్రాంగాలు బేఖాతరు చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఇది కూడా చదవండి:  Jagan Padayatra | పాదయాత్ర పై వైఎస్ జగన్ కీలక అప్‌డేట్ 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *