Panchayat Raj Amendment | అసెంబ్లీలో పంచాయతీరాజ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సీతక్క..

తెలంగాణ శాసనసభలో పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లును పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Panchayat Raj Amendment | తెలంగాణ శాసనసభలో పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లును పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ( Seethakka ) ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే గ్రామ పంచాయతీల ఆర్థిక నిర్వహణ విధానంలో కీలక మార్పులు రానున్నాయి. ఇప్పటివరకు పంచాయతీల సొంత ఆదాయం ప్రభుత్వ ట్రెజరీలో జమ అవుతుండగా.. తాజా సవరణ ద్వారా ఆ నిధులను నేరుగా సమీపంలోని జాతీయ బ్యాంకుల్లోని గ్రామ ఖాతాలోకి జమ చేసుకునేందుకు చట్టపరమైన అవకాశం లభించనుంది.

Panchayat Raj Amendment | ఆర్థిక నిర్వహణ మరింత సులభం..

స్థానిక సంస్థలు తమ అవసరాలకు తగినట్లుగా సొంత నిధులను తక్షణమే వినియోగించుకునేందుకు, ఆర్థిక లావాదేవీల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడనుంది. బ్యాంకుల ద్వారా లావాదేవీలు నిర్వహించడం వల్ల పంచాయతీల ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత అమలు ప్రక్రియ మరింత సులభం కానుంది.

ఇది కూడా చదవండి: Jagan Padayatra | పాదయాత్ర పై వైఎస్ జగన్ కీలక అప్‌డేట్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *