అక్షరటుడే వెబ్డెస్క్: Naga Manikanta Comments | బిగ్బాస్ సీజన్-8లో తన ప్రయాణం మధ్యలోనే ఆగిపోవడానికి అసలు కారణం ఏంటో మాజీ కంటెస్టెంట్ నాగ మణికంఠ స్పష్టం చేశారు. జియోహాట్స్టార్లో ( JioHotstar )నిర్వహించిన బిగ్బాస్ 24/7 లైవ్ చాట్ కార్యక్రమంలో ఆయన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా హౌస్లో తన అనుభవాలు, ఆట తీరుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ లైవ్ చాట్ సమయంలో ఒక నెటిజన్.. “బ్రో, మీరు హౌస్ నుంచి ఎందుకు స్వయంగా బయటకు వచ్చారు?” అని ప్రశ్నించారు. దీనికి మణికంఠ బదులిస్తూ ఆరోజుల్లో తన మానసిక స్థితి అసలు బాగోలేదని తెలిపారు. ఆ పరిస్థితుల్లో తాను తీసుకున్న నిర్ణయమే సరైనదని భావిస్తున్నట్లు చెప్పారు.
Naga Manikanta Comments | విజేతగా నిలిచే వారికి..
అంతేకాకుండా, కేవలం తన వ్యక్తిగత కారణాలే కాకుండా.. హౌస్లో నిజంగా అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే ముందుకు వెళ్లాలని, విజేతగా నిలిచే సత్తా ఉన్నవారికి ఆ అవకాశం దక్కాలనే ఉద్దేశంతోనే తాను తప్పుకున్నట్లు మణికంఠ వివరించారు. జియోహాట్స్టార్ లైవ్ చాట్ వేదికగా మాజీ కంటెస్టెంట్లు తమ మనసులోని మాటలను, బిగ్బాస్ ప్రయాణంలోని అసలు నిజాలను అభిమానులతో పంచుకునే అవకాశం కలుగుతోంది.
ఇది కూడా చదవండి: Bhatti Vikramarka Comments | శుద్ధి చేయాల్సింది నేలను కాదు, మీ కులబుద్ధిని: భట్టి విక్రమార్క