itel Tough | అవుట్‌డోర్ వర్కర్ల కోసం ఐటెల్ టఫ్ ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే!

భారతీయ మార్కెట్లో కఠినమైన రోజువారీ పరిస్థితులను ఎదుర్కొనేలా సరికొత్త రగ్డ్ ఫీచర్ ఫోన్‌ను ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఐటెల్ (itel) విడుదల చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: itel Tough | భారతీయ మార్కెట్లో కఠినమైన రోజువారీ పరిస్థితులను ఎదుర్కొనేలా సరికొత్త రగ్డ్ ఫీచర్ ఫోన్‌ను ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఐటెల్ (itel) విడుదల చేసింది. ‘ఇన్నో’ (INNO) సిరీస్‌లో భాగంగా ‘ఐటెల్ టఫ్’ (itel Tough) పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్.. నిజమైన భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. పొలాలు, నిర్మాణ రంగ పనులు, వర్క్‌షాప్‌లు, మార్కెట్లు, ఇతర అవుట్‌డోర్ ప్రదేశాల్లో కష్టపడి పనిచేసేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

సాధారణ ఫోన్లతో పోలిస్తే ఇది అత్యంత కఠినమైన వాతావరణంలోనూ చెక్కుచెదరకుండా పనిచేసేలా పటిష్టమైన నిర్మాణంతో వస్తుంది. భారతదేశంలో లక్షలాది మంది ప్రజలు దుమ్ము, వేడి, ఎక్కువ గంటల పని మధ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారని, వారి ఫోన్లు కూడా అంతే బలంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మోడల్‌ను తెచ్చినట్లు ఐటెల్ ఇండియా సీఈఓ అరీజీత్ తలపాత్ర తెలిపారు.

itel Tough | బలమైన రక్షణ..

ఐటెల్ టఫ్ ఫోన్‌ను ప్రత్యేకంగా బలమైన నిర్మాణంతో రూపొందించారు. ఇది 2 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా ఏమీ కాకుండా ఉండేలా డ్రాప్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. IP54 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల దుమ్ము, నీటి చినుకుల నుంచి అదనపు రక్షణ లభిస్తుంది. దీనికి తోడు కంపెనీ ఉచితంగా డస్ట్ & షాక్‌ప్రూఫ్ సిలికాన్ కవర్‌ను కూడా అందిస్తోంది. ఫోన్ అనుకోకుండా కింద పడినా, రోజువారీ దెబ్బల నుంచి రక్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

itel Tough | రైతుల కోసం ప్రత్యేకంగా ..

ఈ ఫోన్ ప్రత్యేకతలలో ప్రధానమైనది ‘అగ్రికల్చర్ బటన్’. ఒక్క టచ్‌తో వ్యవసాయానికి సంబంధించిన సమాచారం, ఇన్‌పుట్స్ కోసం నేరుగా ప్రభుత్వ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసే సౌలభ్యం ఇందులో ఉంది. గ్రామీణ, వ్యవసాయ వర్గాలకు అవసరమైన సమాచారాన్ని సులభంగా పొందేందుకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రాత్రి సమయాల్లో పొలాల్లోకి వెళ్లేటప్పుడు, బయట పనిచేసేటప్పుడు లేదా కరెంట్ పోయినప్పుడు అత్యంత వెలుతురునిచ్చే శక్తివంతమైన డ్యూయల్-ల్యాంప్ టార్చ్‌ను ఇందులో పొందుపరిచారు. తక్కువ వెలుతురు ఉండే ప్రదేశాల్లో ఇది మరింత స్పష్టమైన లైటింగ్‌ను ఇస్తుంది.

itel Tough | కింగ్ వాయిస్ (King Voice) ఫీచర్..

చిన్న మెసేజ్‌లు, మెనూలు, ఫోన్ కాల్స్‌ను ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో వాయిస్ ద్వారా వినేలా ‘కింగ్ వాయిస్’ ఫీచర్‌ను ఇన్‌బిల్ట్‌గా ఇచ్చారు. దీంతో చదువురాని వారికి లేదా రోజువారీగా ఫోన్‌ను ఉపయోగించడం మరింత సులభంగా, సౌకర్యవంతంగా మారుతుంది. మార్కెట్లు, వర్క్‌షాప్‌ల వంటి ఎక్కువ శబ్దం ఉండే ప్రదేశాల్లో కూడా స్పష్టమైన ఆడియో వినిపించేలా ‘సూపర్ సౌండ్‌బాక్స్’ను ఏర్పాటు చేశారు. ఇది అధిక వాల్యూమ్‌తో పాటు మెరుగైన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది.

ఇంతకుముందు భారత్‌లో ఏకైక IP67-rated ఫీచర్ ఫోన్‌గా ‘ఐటెల్ ఆక్వా’ను తెచ్చిన కంపెనీ.. ఇప్పుడు ‘ఐటెల్ టఫ్’తో రగ్డ్ ప్రొటెక్షన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లింది. డ్యూరబిలిటీ విషయంలో 91% మంది వినియోగదారులు ఐటెల్ బ్రాండ్‌ను అత్యంత నమ్మకమైనదిగా గుర్తించారు. దేశవ్యాప్తంగా 1.3 లక్షలకు పైగా రిటైల్ అవుట్‌లెట్లు, 1,000కి పైగా సర్వీస్ సెంటర్లను కలిగి ఉన్న ఐటెల్.. ఈ ఫోన్‌ తయారీ లోపాలకు సంబంధించి 1-సంవత్సరం కౌంటర్ రీప్లేస్‌మెంట్ గ్యారెంటీని కూడా అందిస్తోంది.

ఇది కూడా చదవండి:  Bhatti Vikramarka Comments | శుద్ధి చేయాల్సింది నేలను కాదు, మీ కులబుద్ధిని: భట్టి విక్రమార్క

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *