Induru Development Funds | ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి : ఎమ్మెల్యే ధన్​పాల్​

నిజామాబాద్​ అర్బన్​ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ కోరారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Induru Development Funds | నిజామాబాద్​ అర్బన్​ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి నిధులు మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ (MLA Dhannpal Suryanarayana) కోరారు. అసెంబ్లీలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని (CM revanth reddy) కలిసి వినతిపత్రం అందజేశారు.

Induru Development Funds | రూ.200 కోట్లు ఇవ్వాలి

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగర అభివృద్ధి కోసం స్పెషల్ ఫండ్ రూ. 200 కోట్లు ఇవ్వాలన్నారు. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫార్మసీ కళాశాల మంజూరు చేయాలని కోరారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను దృష్టి పెట్టుకొని ఔటర్ రింగ్ రోడ్​లను మంజూరు చేయాలన్నారు.  ప్రధానంగా ఇందూరులో మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని, కళాభారతి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలన్నారు. రాజారాం స్టేడియం ఆధునికీకరణతో పాటు పాత కలెక్టరేట్ మైదానంలో సింథటిక్ ట్రాక్​తో కూడిన స్టేడియం, అలాగే ఇండోర్ స్టేడియం మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇందూరు ఖిల్లా రామాలయం అభివృద్ధితో పాటు రెవెన్యూ శాఖ నుంచి దేవాదాయ శాఖకు బదిలీ చేయాలన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో మరమ్మతులు, మౌలిక సౌకర్యాలకు నిధులు విడుదల చేయాలని, వైద్యులు సిబ్బంది కొరత లేకుండా చూడాలని కోరారు.

ఇది కూడా చదవండి: దేవుళ్లను కూడ వదలడంలేదు.. దొంగలు చివరికి దేవుళ్లను సైతం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *