అక్షరటుడే, డిచ్పల్లి: Kailash Kuwait Murder | కువైట్‌లో (Kuwait) హత్యకు గురైన కోరట్‌పల్లి యువకుడి మృతదేహం ఎట్టకేలకు ఐదునెలల తర్వాత స్వగ్రామానికి చేరుకుంది. దీంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.
Kailash Kuwait Murder | మృతుని కుటుంబ సభ్యుల ఆందోళన..
కైలాష్‌ను హత్య చేసిన మేలయ తండాకు చెందిన గణేష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుని కుటుంబ సభ్యులు బంధువులు, సాంపల్లి తండా వద్ద రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. నిందితుడు గణేష్‌ను శిక్షించేవరకు ఆందోళన విరమించేది లేదని బైటాయించారు. ఈ క్రమంలో కైలాష్ మృతదేహన్ని ఇందల్వాయి టోల్ ప్లాజా నుంచి లోలం, మల్లాపూర్ మీదుగా కోరట్ పల్లి తండాకు తరలించారు. మృతుని బంధువులు ఆగ్రహించి మేలయ తండాలోని నిందితుడు గణేష్ ఇంటిపై దాడి చేశారు.
డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సై అరీఫ్ ఆందోళనకారులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. చట్ట ప్రకారం నిందితుల్ని శిక్షిస్తామని పోలీసులు చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం కోరట్‌పల్లి తండాకు చేరుకుని కైలాష్ మృదేహానికి కన్నీళ్ల మధ్య అంత్యక్రియలు జరిపారు. కువైట్‌లో మార్చి 19న జరిగిన ఘటనలో కైలాష్ హత్యకు గురయ్యాడు. కైలాష్ మృతదేహం కోసం కుటుంబ సభ్యులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఐదు నెలల తర్వాత మృతదేహం స్వదేశానికి చేరుకుంది.
ఇది కూడా చదవండి: కొండా కుటుంబం ఎటువైపు? కీలక రాజకీయ పరిణామంపై ఆసక్తికర చర్చ!