Dussehra Holidays 2026 | అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు.. పిల్లల మైండ్‌ సెట్‌ను ఇలా రీఫ్రెష్ చేద్దామా..

రోజూ పొద్దున్నే లేచి ఆతురుతగా బడికి పరుగెత్తడం, పుస్తకాల మోత, హోమ్‌వర్కుల ఒత్తిడి, పరీక్షల టెన్షన్‌తో గడిపిన చిన్నారులకు రీఛార్జ్ అయ్యే అవకాశం వచ్చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Dussehra Holidays 2026 | రోజూ పొద్దున్నే లేచి ఆతురుతగా బడికి పరుగెత్తడం, పుస్తకాల మోత, హోమ్‌వర్కుల ఒత్తిడి, పరీక్షల టెన్షన్‌తో గడిపిన చిన్నారులకు రీఛార్జ్ అయ్యే అవకాశం వచ్చేసింది. విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 22తో ఈ పండుగ సెలవులు ముగియనున్నాయి. వరుసగా 13 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు లభించడంతో పిల్లలు కేవలం టీవీలు, మొబైల్ ఫోన్‌లకే పరిమితం కాకుండా.. కాలాన్ని విజ్ఞానదాయకంగా, ఉత్సాహంగా మలచుకోవడానికి తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహం అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Dussehra Holidays 2026 | కళలను తెలుసుకునే అవకాశం..

బతుకమ్మ , దసరా ( Vijayadashami ) విశేషాలను పిల్లలు తమ పెద్దల దగ్గర పండుగ వెనక ఉన్న కథలు, సాంప్రదాయాలు తెలుసుకునేలా ప్రోత్సహించవచ్చు. పూలను సేకరించడం, రంగురంగుల బతుకమ్మలను పేర్చడంలో భాగస్వామ్యం చేయడం ద్వారా వారికి మన సంస్కృతిపై మమకారం పెరుగుతుంది. పాత కాగితాలు, రంగుల దారాలు, మట్టితో బొమ్మలు లేదా చిన్నపాటి క్రాఫ్ట్ వర్క్స్ చేయడం నేర్పించవచ్చు. ఇది వారి సృజనాత్మకతను (Creativity) వెలికితీస్తుంది.

Dussehra Holidays 2026 | సరికొత్త హాబీలు..

రోజూ కొద్దిసేపు మంచి కథల పుస్తకాలు, బాల సాహిత్యం లేదా మహాభారత, రామాయణాలకు సంబంధించిన పిల్లల కామిక్ బుక్స్ చదివే అలవాటు చేయండి. ఇది వారి ఆలోచనా శక్తీ, పదసంపదను పెంచుతుంది. చిన్న వయసులోనే కోడింగ్ బేసిక్స్, లేదా వారికి ఇష్టమైన డ్రాయింగ్, పెయింటింగ్, వంటి వాటిపై ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ వర్క్‌షాప్‌లలో చేర్పించవచ్చు.

Dussehra Holidays 2026 | శారీరక దృఢత్వం..

కేవలం గ్యాజెట్స్‌కే పరిమితం కాకుండా చెస్‌, క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్ లేదా సాయంత్రం వేళల్లో , సైక్లింగ్, బ్యాడ్మింటన్ వంటి ఆటలు ఆడేలా చూడండి. ఇంట్లోని మొక్కలకు నీళ్లుపోయడం, తమ గదిని సర్దుకోవడం వంటి చిన్న చిన్న పనులను స్వయంగా చేసుకునే అలవాటు చేయడం వల్ల వారిలో బాధ్యతాభావం పెరుగుతుంది. ఈ దసరా సెలవులను కేవలం కాలక్షేపంగా కాకుండా, పిల్లలు తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అద్భుతమైన అవకాశంగా మలచుకుందాం.

ఇది కూడా చదవండి:  Paddy Grain Demand | దళారులే ‘మద్దతు ధర’ చెల్లిస్తున్నారు.. వరి ధాన్యానికి భారీ డిమాండ్..

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *