India Gold Medal | భారత్​ ఖాతాలో మరో గోల్డ్​ మెడల్​

ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో మహిళల 4x400మీ రిలేలో భారత జట్టు గోల్డ్​ మెడల్​ సాధించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Gold Medal | ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ అథ్లెట్స్​ ప్రతిభ కనబరిచారు. మంగళవారం పసిడితో సహా పలు పతకాలు సాధించారు. దీంతో భారత ఖాతాలో మొత్తం 52 పతకాలు చేరాయి.

అథ్లెటిక్స్ విభాగంలో మహిళల 4×400మీ రిలేలో భారత జట్టు గోల్డ్​ మెడల్​ సాధించింది. విత్య రామరాజ్, కిరణ్, ప్రాచి, పూవమ్మ మచెట్టిరాలతో కూడిన జట్టు 3:29.69 సమయంతో అగ్రస్థానంలో గెలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 4×400 మీటర్ల రిలే, మిక్స్‌డ్ 4×100మీ రిలే ఈవెంట్‌లలో భారత్ కాంస్య పతకాలను గెలిచింది.

India Gold Medal | హైజంప్​లో..

మహిళల హై జంప్ ఫైనల్‌లో పూజా సింగ్ (Pooja Singh) మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్​ మెడల్​ సాధించింది. గుల్వీర్ సింగ్ పురుషుల 5000మీ ఈవెంట్‌లో కాంస్యం సాధించారు. అంతకు ముందు ఆయన పురుషుల 1,500మీ, 10,000మీ ఈవెంట్‌లలో రజత పతకాలను గెలుచుకున్నాడు. ప్రస్తుతం భారత్​ 6 గోల్డ్​, 21 రజత, 25 కాంస్య పతకాలతో 10వ స్థానంలో ఉంది. పతకాలు సాధించిన క్రీడాకారులను కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు అభినందించారు.

 

దీనిని కూడా చదవండి : Bandi Sanjay SIR | కాంగ్రెస్‌కు ఎన్నికల్లో గెలిచే సత్తా లేదు.. బండి సంజయ్ సంచలన విమర్శలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *