అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Telangana Liberation Day | మైనార్టీల కోసమే ప్రభుత్వ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించట్లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) ఆరోపించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు.
Telangana Liberation Day | రేవంత్ ఉద్దీన్గా..
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ అధికారికంగా నిర్వహించాలని దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంతుష్టీకరణ రాజకీయాల కోసమే సెప్టెంబర్ 17 వేడుకలను నిర్వహించకుండా చేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి ‘రేవంత్ ఉద్దీన్’లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రజాకార్ల హయాంలో సాగిన బలవంతపు మతమార్పిడులు, రామ్‌జీ గోండ్ సహా వెయ్యి మందిని ఉరితీసిన నిర్మల్ ఉదంతం, వల్లాలలో త్రివర్ణ పతాకం ఎగురవేసిన పది మంది బడిపిల్లల హత్య, గుండ్రంపల్లి బావిలో 200 మందిని ఊచకోత కోసిన అకృత్యాలను ఆయన గుర్తుచేశారు. కొమురం భీమ్, దొడ్డి కొమరయ్య వంటి వీరుల త్యాగాలతో పాటు సర్దార్ వల్లభభాయ్ పటేల్ దృఢ సంకల్పం, ‘ఆపరేషన్ పోలో’ సైనిక చర్యల ఫలితంగానే తెలంగాణ విముక్తి సాధించి భారతదేశంలో విలీనమైందన్నారు.
Telangana Liberation Day | సర్దార్ పటేల్ విగ్రహం నెలకొల్పాలి
సెప్టెంబర్ 17ను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా జరపాలని, హైదరాబాద్ నడిబొడ్డున సర్దార్ పటేల్ భారీ విగ్రహం, ప్రపంచస్థాయి మ్యూజియం ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో అమరుల స్మారక కేంద్రాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. భైరాన్‌పల్లి, పరకాల వంటి పోరాట గ్రామాల్లో స్మారక స్తంభాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఈ చరిత్రను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, ప్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, న్యాలం రాజు, పద్మరెడ్డి, బొబ్బిలి వేణు గోపాల్, పురుషోత్తం, జగన్ రెడ్డి, ఆనంద్, శంకర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Drunk Driving Cases | డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తాం : సీపీ సాయిచైతన్య