అక్షరటుడే, కామారెడ్డి: Protest Duty Guidelines | నిరసనలు, ఆందోళనల సమయంలో ప్రతి పోలీసు సిబ్బంది సంయమనంతో వ్యవహరిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందికి బందోబస్తు విధుల నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
Protest Duty Guidelines | ఉన్నతాధికారులకు వరకు..
ఎస్పీ (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. హోంగార్డు స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు బందోబస్తు విధులు కీలకమని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవిస్తూనే శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పరిస్థితులను అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. చేయదగినవి, చేయకూడని పనులపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియాలో నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని, విధి నిర్వహణలో వృత్తి నైపుణ్యం ప్రదర్శించాలని సూచించారు.
Protest Duty Guidelines | ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి
ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, గేమ్స్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. వాటికి అలవాటు పడితే ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలై ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. క్షణిక ఆకర్షణలకు లోనై కుటుంబ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, సహచర సిబ్బంది ఎవరైనా బెట్టింగ్‌లకు బానిసైతే వారిని ఆ ఊబి నుంచి బయటకు తీసుకురావాలన్నారు. ప్రజలతో మర్యాదగా, చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు సంతోష్ కుమార్, నవీన్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Liberation Day | మైనార్టీల కోసమే ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించట్లేదు..