Fee Reimbursement Protest | ఫీజు బకాయిలు విడుదల చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం..

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ హెచ్చరించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Fee Reimbursement Protest | విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదని బీజేవైఎం(BJYM  Nizamabad) జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ హెచ్చరించారు. బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ఫీజు బకాయి – బీజేపీ లడాయి’ కార్యక్రమంలో భాగంగా గురువారం నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో (Giriraj College Nizamabad) విద్యార్థులతో సమావేశం నిర్వహించారు.

Fee Reimbursement Protest | మిస్డ్​ కాల్​.. క్యూఆర్​ కోడ్​ స్కాన్​ ద్వారా..

ఈ సందర్భంగా కళాశాలలో మిస్డ్‌కాల్, క్యూఆర్‌ కోడ్ స్కాన్ ద్వారా సంతకాల సేకరణ చేపట్టారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కో-కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మారెడ్డి వనిత, కార్పొరేటర్ పంచారెడ్డి అనిత, జిల్లా నాయకులు రాజ్ గణేష్, రాకేష్, మహేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: జూరాల ప్రాజెక్టుకు భారీ వరద 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *