MV Electrosystems IPO | పబ్లిక్ ఇష్యూకు మరో కంపెనీ.. జీఎంపీ ఎంతంటే?

త్రీఫేజ్ ప్రపల్షన్ పరికరాలు, కేబుల్ రక్షణ సామగ్రి, స్విచ్‌గేర్ ప్యానెళ్ల తయారీ కంపెనీ అయిన ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: MV Electrosystems IPO | ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీని 2009లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉంది. ఇది త్రీఫేజ్ ప్రపల్షన్ పరికరాలు, కేబుల్ రక్షణ సామగ్రి, స్విచ్‌గేర్ ప్యానెళ్ల తయారీలో ప్రత్యేకతతో రైల్వే ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రసిద్ధి చెందింది.

రైల్వే రోలింగ్ స్టాక్ కోసం విద్యుత్, పవర్ ఎలక్ట్రానిక్స్ పరికరాలను డిజైన్, అభివృద్ధి చేయడంతోపాటు తయారు కూడా చేస్తుంది. దేశంలో విస్తరిస్తున్న రైల్వే విద్యుదీకరణ, హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల నుంచి ఈ కంపెనీ ప్రయోజనం పొందుతోంది. ఈ ఏడాది మే 31 నాటికి కంపెనీలో 206 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

MV Electrosystems IPO | రూ. 290 కోట్లు..

కంపెనీ ఫ్రెష్ ఇష్యూ కింద రూ. 5 ఫేస్ వ్యాల్యూ కలిగిన 68,23,528 షేర్లను విక్రయించడం ద్వారా రూ. 290 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ఐపీవో (IPO) ద్వారా వచ్చిన ఆదాయాన్ని లాంగ్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం, కొత్త పవర్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ మరియు రీసెర్చ్ డిజైన్, డెవలప్‌మెంట్ కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టడం కోసం, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

MV Electrosystems IPO | ప్రైస్ బ్యాండ్..

కంపెనీ ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్‌ను రూ. 400 నుంచి రూ. 425 లుగా నిర్ణయించింది. ఒక లాట్‌లో 34 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,450 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 13 లాట్లకోసం బిడ్లు వేయవచ్చు.

MV Electrosystems IPO | కోటా, జీఎంపీ..

క్యూఐబీలకుì 75 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, ఎనఐఐలకు 10 శాతం షేర్లను కేటాయించారు. కంపెనీ షేర్లు గ్రే మార్కెట్ లో 18 శాతం ప్రీమియంతో ఉన్నాయి. అంటే లిస్టింగ్ సమయంలో 18 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

MV Electrosystems IPO | ముఖ్యమైన తేదీలు..

పబ్లిక్ ఇష్యూ జూలై 30న ప్రారంభమైంది. బిడ్డింగ్ గడువు ఆగస్టు 3తో ముగియనుంది. 4వ తేదీన షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ వెలువడే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఆగస్టు 6న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అవనున్నాయి.

ఇది కూడా చదవండి..: Greenply Gold Plywood | గ్రీన్ప్లై గోల్డ్.. దీర్ఘకాలిక ఇంటీరియర్ల కోసం వాటర్ప్రూఫ్ ప్లైవుడ్ మన్నిక

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *