Meta Layoffs | ‘మెటా’పైనా ఏఐ ఎఫెక్ట్ .. 8 వేల మంది ఉద్యోగాలకు ఎసరు!

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Meta Layoffs | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అన్ని రంగాలపైనా ప్రభావం చూపుతోంది. ఖర్చులను తగ్గించుకోవడం కోసం కంపెనీలు ఏఐకి ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి.

తాజాగా మెటా సైతం భారీ లేఆఫ్‌లకు తెరతీసింది. సుమారు 8 వేల మందిని తొలగించడానికి సన్నద్ధమవుతోంది. మొదటి దెబ్బ సింగపూర్‌లోని సిబ్బందిపై పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ తొలగింపుల ప్రభావం మెటా విస్తరిస్తున్న ఏఐ వ్యాపారానికి నేరుగా సంబంధం లేని టీమ్‌లపై ఎక్కువగా పడనుంది. ఈ తొలగింపులు మెటాకు సంవత్సరానికి సుమారు 3 బిలియన్ డాలర్ల ఆపరేటింగ్ ఖర్చులను ఆదా చేస్తాయని అంచనా వేస్తున్నారు.

Meta Layoffs | పునర్వ్యవస్థీకరణలో భాగంగా..

ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ అయిన మెటా తన విస్తృత పునర్వ్యవస్థీకరణ వ్యూహంలో భాగంగా ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ ఆధారిత ఉత్పత్తులపై ఖర్చులను పెంచుతోంది. ఇందుకోసం వివిధ వ్యాపార యూనిట్లలో ఖర్చులను తగ్గించి కార్యకలాపాలను స్ట్రీమ్‌లైన్ చేస్తోంది. దీంతో సిబ్బంది మొదటి దెబ్బకు గురవుతున్నారు. మెటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 వేల మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. కంపెనీ యొక్క అతిపెద్ద ఆసియా హబ్‌లలో ఒకటైన సింగపూర్‌లోని ఉద్యోగులు దీనికి మొదట బలి అవుతున్నారు. సుమారు 8 వేల మందికి ఇప్పటికే లేఆఫ్ నోటీసులు (Layoff Notices) ఇవ్వడం ప్రారంభించింది. బుధవారం ఉదయమే చాలా మంది నోటీసులు అందుకున్నట్లు తెలిసింది. అమెరికా, ఐరోపాలలోని హబ్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి సమయాల ప్రకారం త్వరలోనే నోటీసులు అందే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

Meta Layoffs | గతంలో 20 వేల మందిని తొలగించిన చరిత్ర..

మెటా ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2022లో జుకర్‌బర్గ్ “ఎఫిషియన్సీ ఇయర” వ్యూహం అమలు చేశారు. ఇందులో భాగంగా 20 వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా మరో 8 వేల మంది ఈ జాబితాలో చేరబోతున్నారు.

ఇది కూడా చదవండి..: Samsung Employees Strike | శాంసంగ్‌లో బోనస్ వివాదం.. సమ్మెకు సిద్ధమైన ఉద్యోగులు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *