Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్​కు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Metro | హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చడంలో మరో కీలక అడుగు పడింది. మెట్రో సెకండ్ ఫేజ్​కు కేంద్ర ప్రభుత్వం (Central Government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండో దశకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్​తో నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సమావేశం అయ్యారు.

Hyderabad Metro | కీలక ప్రాజెక్టులపై సమీక్ష

ఢిల్లీలో కేంద్రమంత్రిలో జరిగిన సమావేశం సందర్భంగా హైదరాబాద్‍ (Hyderabad)లో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్షించారు. నగరంలో మౌలిక వసతులు, పారిశుధ్యం, ప్రజారవాణాపై చర్చించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

Hyderabad Metro | సూత్రప్రాయంగా అంగీకారం

భేటీలో హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై చర్చ జరిగిందని కిషన్​ రెడ్డి తెలిపారు. మెట్రో సెకండ్ ఫేజ్​కు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారని పేర్కొన్నారు. డీపీఆర్ అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మనోహర్​ లాల్​ ఖట్టర్ తెలిపారని చెప్పారు. అయితే కేంద్ర, రాష్ట్రాలు 50:50 పద్ధతిలో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Lakshmi Kumar Remand | జలమండలి జీఎం లక్ష్మీకుమార్​కు 14 రోజుల రిమాండ్​

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *