Lakshmi Kumar Remand | జలమండలి జీఎం లక్ష్మీకుమార్​కు 14 రోజుల రిమాండ్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Lakshmi Kumar Remand | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి మేనేజర్ లక్ష్మి కుమార్​ ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేశారు. ఆయనను ఏసీబీ కోర్టు (ACB Court) ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్​ విధించింది. దీంతో కుమార్​ను చంచల్​గూడ జైలుకు తరలించారు.

Lakshmi Kumar Remand | భారీగా అక్రమాస్తుల గుర్తింపు

జీఎం లక్ష్మి కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు (ACB Officers) మంగళవారం సోదాలు నిర్వహించి భారీగా అక్రమ ఆస్తులు గుర్తించిన విషయం తెలిసిందే. ఆయన ఇంట్లో రూ. కోటికిపైగా నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం బయటపడ్డాయి. దీంతో ఆయన ఇల్లుతో పాటు కార్యాలయం, స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేయగా.. కండ్లు చెదిరే ఆస్తులు వెలుగుచూశాయి.

Lakshmi Kumar Remand | నగదు, ఆభరణాలు సీజ్​

నాంపల్లి రెడ్‌‌‌‌హిల్స్‌‌‌‌ (Nampally Redhills) వాటర్‌‌‌‌‌‌‌‌ బోర్డు జీఎంగా ఉన్న లక్ష్మి కుమార్.. గోదావరి ఫస్ట్‌‌‌‌ ఫేజ్‌‌‌‌, కృష్ణా వాటర్‌‌‌‌ పైప్‌‌‌‌లైన్‌‌‌‌ ప్రాజెక్టులో ఈఈగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు పలుచోట్ల ఏకకాలలో సోదాలు నిర్వహించారు. లక్ష్మీకుమార్​కు సుమారు రూ. 100 కోట్ల విలువైన స్తిర, చరాస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు.

సోదాల్లో దొరికిన రూ.1.10 కోట్ల క్యాష్, 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి వస్తువులను సీజ్‌‌‌‌ చేశారు. వీటితో పాటు నిజామాబాద్‌‌‌‌, సంగారెడ్డి జిల్లా (Sangareddy District)ల్లో సుమారు 18 ఎకరాల భూములు ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు, హైదరాబాద్‌‌‌‌లో ఆరు ఓపెన్ ప్లాట్లు, మూడు ఫ్లాట్స్‌‌‌‌, ఇండిపెండెంట్‌‌‌‌ హౌస్‌‌‌‌కు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆయనకు రెండు బ్యాంక్ లాకర్లు ఉన్నట్లుగా గుర్తించారు. లాకర్లలోని పలు పత్రాలను స్వాధీనపర్చుకున్నారు.

Lakshmi Kumar Remand | 1990లో ఉద్యోగంలో చేరి..

నిజామాబాద్ జిల్లా (Nizamabad District)కు చెందిన లక్ష్మీ కుమార్‌‌‌‌ 1990లో హైదరాబాద్‌‌‌‌ మెట్రోపాలిటన్‌‌‌‌ బోర్డులో ఉద్యోగం పొందారు. అంచెలంచెలుగా ఎదిగి నాంపల్లి రెడ్‌‌‌‌హిల్స్‌‌‌‌ వాటర్ సప్లయ్ బోర్డు జీఎం అయ్యారు. ఈ మధ్యే రూ. కోట్లు ఖర్చు పెట్టి కూతురి వివాహం అంగరంగ వైభంగా నిర్వహించారు. అయితే ఆయన అవినీతిపై‌‌ ఫిర్యాదులు రాగా.. ఏసీబీ అధికారులు సోదారులు చేపట్టి ఆయనను అరెస్ట్‌‌‌‌ చేశారు. ఏసీబీ స్పెషల్‌‌‌‌ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చారు. దీంతో న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్​గూడ జైలు (Chanchalguda Jail)కు పంపించారు.

ఇది కూడా చదవండి..: ACB Raids HMWSSB GM | జలమండలి జీఎంకు ఏసీబీ షాక్‌.. కుప్పలుగా నోట్ల కట్టలు, బంగారం స్వాధీనం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *