అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Timings | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) టైమింగ్స్ లో మార్పులు చేశారు. నేటి నుంచి(ఆగస్టు 3) స్టాక్ ట్రేడింగ్ ముగింపు వేళలు, అలాగే ముగింపు ధర నిర్ణయించే పద్ధతుల్లో సెబీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కీలక సంస్కరణలు అమలులోకి తెచ్చాయి. ఇందులో భాగంగా ఎఫ్ అండ్ వో విభాగంలో ఉన్న షేర్ల కోసం కొత్తగా క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ను నిర్వహిస్తారు. ఇది ఇంట్రాడే ట్రేడర్లు, డెరివేటివ్స్ చేసేవారు, బ్రోకరేజ్ సంస్థలపై ప్రభావం చూపనుంది.
Stock Market Timings | మూడు రకాల ముగింపు వేళలు..
ఇప్పటివరకు మార్కెట్లలోని అన్ని విభాగాలకు ఒకే ముగింపు సమయం ఉండేది. ఇకపై ఇది మÖడు రకాలుగా మారనుంది. ఎఫ్ అండ్ వో పరిధిలోకి రాని సాధారణ షేర్ల ట్రేడింగ్ ఎప్పటిలాగే 3.30 గంటల వరకు కొనసాగనుంది. ఎఫ్ అండ్ వో జాబితాలో ఉన్న షేర్లలో సాధారణ నిరంతర ట్రేడింగ్ మధ్యాహ్నం 3:15 గంటలకు నిలిచిపోతుంది. ఆ తర్వాత 3.15 నుంచి 3.35 గంటల వరకు క్లోజింగ్ ఆక్షన్ సెషన్ నిర్వహిస్తారు. ఈ సెషన్‌కు అనుగుణంగా హెడ్జింగ్ చేసుకునేందుకు వీలుగా ఈక్విటీ డెరివేటివ్స్ (ఇండెక్స్, స్టాక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ) ట్రేడింగ్ సమయాన్ని 3.40 గంటల వరకు అవకాశం ఇస్తారు.
Stock Market Timings | మారనున్న స్క్వేర్ ఆఫ్ టైమింగ్స్..
కొత్త విధానం వల్ల ఇంట్రాడే పొజిషన్లను బ్రోకర్లు స్క్వేర్ ఆఫ్ చేసే సమయాలు కూడా మారనున్నాయి. సాధారణంగా 3.15 గంటలకంటే ముందే అంటే 3.05 నుంచి 3.15 గంటల మధ్యలో ఆటో స్క్వేర్ ఆఫ్ అయ్యే అవకాశాలున్నాయి.
Stock Market Timings | కొత్త పద్ధతిలో క్లోజింగ్ ప్రైస్ నిర్ణయం..
ఇప్పటివరకు మార్కెట్ చివరి 30 నిమిషాల్లో జరిగిన ట్రేడ్‌ల సగటు ఆధారంగా క్లోజింగ్ ప్రైస్‌ను నిర్ణయించేవారు. దీనివల్ల చివరి నిమిషాల్లో పెద్ద ఆర్డర్లు పెట్టి ధరలను ప్రభావితం చేసేందుకు ఆస్కారముండేది. ఇకపై ఆ పద్ధతికి స్వస్తి పలికి లంసమ్ ఆక్షన్ ఆధారంగా ధరను ఆవిష్కరిస్తారు.
Stock Market Timings | పనిచేస్తుందిలా..
మధ్యాహ్నం 3.15 నుంచి 3.20 గంటల వరకు ట్రాన్సిషన్ వ్యవధిలో రిఫరెన్స్ ధరను లెక్కిస్తారు. 3.20 నుంచి 3.25 గంటల వరకు లిమిట్, మార్కెట్ ఆర్డర్లను స్వీకరిస్తారు. 3.25 నుంచి 3.30 గంటల మధ్య లిమిట్ ఆర్డర్లను మాత్రమే అనుమతిస్తారు. ఇందులో 3.28 నుంచి 3.30 గంటల మధ్య ఏదో ఓ క్షణంలో ఆర్డర్ విండో క్లోజ్ అవుతుంది. చివరికి 3.30 నుంచి 3.35 గంటల మధ్య కొనుగోలు, అమ్మకం ఆర్డర్లన్నింటినీ మ్యాచ్ చేసి ఒకే ఈక్విలిబ్రియం ధరను క్లోజింగ్ ప్రైస్‌గా ప్రకటిస్తారు. ఈ కొత్త విధానం వల్ల చివరి క్షణాల్లో మార్కెట్‌ను తప్పుదోవ పట్టించడం కష్టమవుతుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Aug 03 Gold Prices | చమురు ధరల పతనంతో బంగారానికి ఊతం..హైదరాబాద్‌లో పసిడి ఎలా ఉందంటే..