అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Crash | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా స్టాక్ మార్కెట్ (Stock Market) కుదేలవుతోంది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు వంద డాలర్లకు చేరువవడంతో ద్రవ్యోల్బణ భయాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వరుసగా నాలుగో సెషన్‌లోనూ దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది.
Stock Market Crash | గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై..
సెన్సెక్స్ గురువారం ఉదయం 240 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 170 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో 382 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 92 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 28 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 114 పాయింట్లు పైకి ఎగబాకింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మళ్లీ అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్ 574 పాయింట్లు, నిఫ్టీ 183 పాయింట్లు పడిపోయాయి. చివరి గంటలో కాస్త తేరుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 363 పాయింట్ల నష్టంతో 76,391 వద్ద, నిఫ్టీ 126 పాయింట్ల నష్టంతో 23,869 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,637 కంపెనీలు లాభపడగా 2,585 స్టాక్స్ నష్టపోయాయి. 169 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 96 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 96 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 6 స్టాక్ లాభపడగా.. 24 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎం అండ్ ఎం 1.70 శాతం, టీసీఎస్ 1.51 శాతం, ఎటర్నల్ 1.16 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.63 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.61 శాతం లాభపడ్డాయి.
Top Losers : అదానీపోర్ట్స్ 2.26 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.96 శాతం, ఇండిగో 1.59 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.36 శాతం, ఎస్బీఐ 1.22 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: 92 మంది పీజీ విద్యార్థులకు రూ.4.26 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించిన కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్!