అక్షరటుడే వెబ్‌డెస్క్: Bestie Bracelet Collection | స్నేహం అంటే ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండటం కాదు.. వారి మధ్య ఉండే భిన్నత్వాలను వేడుక చేసుకోవడమే. ఒకరు ప్రణాళికలతో నడిస్తే, మరొకరు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఒకరు సుదీర్ఘమైన వాయిస్ నోట్స్ పంపిస్తే, మరొకరు మీమ్స్‌తో బదులివ్వవచ్చు. ఇలా ఎప్పుడూ ఒకేలా ఉండకపోయినా, ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా నిలిచే అద్భుతమైన, పరిపూర్ణం కాని బంధాల కోసమే ప్రత్యేకమైన కలెక్షన్ వచ్చింది. బలానికి, శాశ్వత బంధానికి ప్రతీకగా నిలిచే నేచురల్ డైమండ్స్‌తో రూపొందించిన ‘ది బెస్టీ బ్రాస్‌లెట్ కలెక్షన్’ అలాంటి ప్రత్యేకమైన స్నేహాలను మరింత గౌరవిస్తోంది. ఫ్రెండ్‌షిప్ డే లేదా ప్రత్యేక సందర్భాల్లో బెస్టీస్‌కి బహుమతిగా ఇవ్వడానికి వీలుగా వివిధ రకాల డిజైన్లలో ఈ కలెక్షన్ అందుబాటులో ఉంది.
ఈ కలెక్షన్‌లోని ప్రధాన డిజైన్లు ఇవే..
ది కాంప్లిమెంటరీ లింక్ సెట్: వ్యతిరేక స్వభావాలు ఉన్నవారు ఆకర్షితులవుతారనే నానుడికి తగ్గట్టుగా ఉంటుంది. ఒక బ్రాస్‌లెట్ బోల్డ్ డిజైనర్ లింక్స్‌తో, మరొకటి సున్నితమైన చైన్‌తో రూపుదిద్దుకున్నాయి. వీటి మధ్యలో ఉండే మెరిసే నేచురల్ డైమండ్.. ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా కాలంతో మారని బంధాన్ని గుర్తుచేస్తుంది. కొన్ని స్నేహాలు ఎంతో సహజంగా కుదురుతాయి. ఒకదానికొకటి సరిగ్గా అమరేలా రూపొందించిన ఈ బ్రాస్‌లెట్లు.. ఇద్దరూ ఒకరిలోని ఉత్తమ గుణాలను బయటకు తీసుకురావడమే గొప్ప బంధం అని చాటుతాయి.
Bestie Bracelet Collection | ది డైమండ్ సైఫర్..
ఇద్దరు స్నేహితులకు మాత్రమే అర్థమయ్యే రహస్య భాష స్ఫూర్తితో దీన్ని తీర్చిదిద్దారు. మోర్స్ కోడ్ ఆధారంగా దీర్ఘచతురస్రాకార, గుండ్రటి నేచురల్ డైమండ్లను ప్రత్యామ్నాయంగా ఉంచి దీన్ని రూపొందించారు. మినిమల్ డిజైన్‌తో ఉన్నప్పటికీ ఎంతో భావోద్వేగంతో నిండి ఉంటుంది.
ది ఎటర్నల్ సర్కిల్..
ఈ సెట్‌లోని ప్రతి బ్రాస్‌లెట్ ఒక శాశ్వత వృత్తంలో సగాన్ని కలిగి ఉంటుంది. ఒక దాంట్లో చిన్న చిన్న డైమండ్స్ మెరుస్తుంటే, మరొక దాంట్లో మధ్యలో ఒకే వజ్రం ఉంటుంది. విడివిడిగా చూసినా, కలిసి ఉన్నా ఇవి ఎల్లప్పుడూ స్థిరంగా నిలిచే స్నేహానికి ప్రతీకగా నిలుస్తాయి. కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న నేచురల్ డైమండ్స్ ఎంత విలువైనవో.. మీ స్నేహం కూడా అంతే శాశ్వతమైనది, విలువైనది అని ఈ కలెక్షన్ చెబుతోంది.