అక్షరటుడే, వెబ్‌డెస్క్: July 23 Market Analysis | అమెరికా, ఇరాన్‌ల మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ముడిచమురు(Crude oil) ధర బ్యారెల్‌కు వంద డాలర్ల దిశగా పయనిస్తోంది.
దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో వరుసగా నాలుగో సెషన్‌లోనూ మన మార్కెట్లు గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్(Wallstreet) నష్టాలతో, యూరోప్ మార్కెట్లు లాభాలతో ముగియగా.. గురువారం ఉదయం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి.
July 23 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 0.57 శాతం, ఎస్ అండ్ పీ 0.14 శాతం నష్టపోగా.. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.10 శాతం లాభంతో ఉంది.
July 23 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.57 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.89 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 1.22 శాతం లాభపడ్డాయి.
July 23 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 2.40 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.61 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.54 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.16 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.04 శాతం లాభాలతో ఉన్నాయి.
సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.34 శాతం నష్టాలతో కదలాడుతోంది. గిఫ్ట్ నిఫ్టీ 0.39 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 819 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 418 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.01 నుంచి 0.84 కు పడిపోయింది.
- విక్స్ 5.5 శాతం పెరిగి 13.29 కు చేరింది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 95.75 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 32 పైసలు బలహీనపడి 96.57 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.06 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.65 వద్ద ఉన్నాయి.
- సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.