Oct 08 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు..ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 08 Market Analysis | గల్ఫ్, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో నౌకాయానంపై దాడులు పెరగడంతో ముడి చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చమురు ధరలు మరింత పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నాస్‌డాక్ (Nasdaq) ఆరు రోజులలో మొదటిసారిగా నష్టాలను నమోదు చేసింది. గురువారం ఉదయం ఆసియా మార్కెట్లు సైతం నష్టాల బాటలో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Oct 08 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

దీర్ఘకాలిక యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతుండడం, అప్పులు, ద్రవ్యోల్బణ భయాలతో వాల్‌స్ట్రీట్ గత సెషన్‌లో ఒత్తిడికి గురయ్యింది. నాస్‌డాక్ 0.22 శాతం, ఎస్ అండ్ పీ 0.22 శాతం పెరగ్గా.. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.05 శాతం నష్టంతో ఉంది.

Oct 08 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.37 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.80 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.23 శాతం నష్టపోయాయి.

Oct 08 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో చైనాకు చెందిన షాంఘై 0.16 శాతం లాభంతో ఉండగా.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 2.46 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.91 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.73 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.60 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.35 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.10 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా తొమ్మిదో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. నికరంగా రూ. 6,121 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 40 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 4,596 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 34 పైసలు బలహీనపడి 96.77 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 101.87 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 102.16 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.31 శాతం వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.06 నుంచి 0.89కు తగ్గింది.
  • విక్స్ 2.04 శాతం పెరిగి 13.88 వద్ద ఉంది.
  • సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *