Oct 08 Horoscope | ఆప్తుల సలహాతో అద్భుత ఆర్థిక లాభాలు.. ఇక ఈ రాశుల వారికి వేరే లెవెల్

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 08 Horoscope | జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం (అక్టోబర్ 8, 2026) నాటి గ్రహాల అనుకూల సంచారంతో పలు రాశుల వారికి అద్భుతమైన యోగాలు కలగబోతున్నాయి.

విశేషమైన గ్రహ స్థితుల వల్ల ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకోని పురోగతి సాధ్యమవుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభించడమే కాకుండా, అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుని ఆకస్మిక ధనలాభం అందుతుంది.

Oct 08 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: Oct 08 Horoscope | రోజు ద్వితీయార్థంలో ఆర్థిక పరిస్థితి మెరుగై ఆకస్మిక ధనలాభం అందుతుంది. ఆఫీసులో మీ జ్ఞానం, సేవలు సహోద్యోగుల ముందు మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. గ్రహాల అనుకూలత వల్ల రోజంతా ఆనందంగా గడపడానికి ఎన్నో మంచి అవకాశాలు లభిస్తాయి.

వృషభ రాశి: Oct 08 Horoscope | ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత ధనం చేతికి అందడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలోకి కొత్త వ్యక్తి రాక వల్ల ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు కలసివస్తాయి, అయితే భాగస్వాములతో చిన్నపాటి అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం ఉంది.

మిథున రాశి: Oct 08 Horoscope | ధన కొరత, ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు తీసుకునే సరైన నిర్ణయాలు మీకు ఆసరాగా నిలుస్తాయి. చిన్న తరహా వ్యాపారులు ఆప్తుల నుంచి పొందే సలహాల వల్ల మంచి ఆర్థిక లాభాలు సాధిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సమాజంలో మంచి పరపతి ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆఫీసులో ఇతరుల విషయాలలో తలదూర్చకుండా మీ పనిపైనే పూర్తి శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.

కర్కాటక రాశి: Oct 08 Horoscope | దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి శరీరంలో నూతనోత్సాహం నిండుతుంది. అదనపు రాబడి కోసం కొత్త ఆలోచనలను అమలు చేయడం వల్ల ఆశించిన ఫలితాలు వస్తాయి. స్నేహితులతో కలిసి సంతోషంగా, ఆహ్లాదకరంగా గడుపుతారు.

సింహ రాశి: Oct 08 Horoscope | కొత్త ఆర్థిక పథకాలలో పెట్టుబడి పెట్టేముందు వాటి లాభనష్టాలను క్షుణ్ణంగా పరిశీలించడం అవసరం. ఇంట్లో పండుగ వాతావరణం నిండి మీలోని మానసిక ఒత్తిడిని పూర్తిగా తొలగిస్తుంది. ఆఫీసులో సీనియర్లు, వారి అనుభవం నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటారు.

కన్యా రాశి: Oct 08 Horoscope | ప్రయాణాల్లో ముఖ్యమైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరం. బంధువుల ఇంటికి వెళ్లడం వల్ల రోజువారీ బిజీ లైఫ్ నుంచి మంచి విశ్రాంతి లభిస్తుంది. ఆఫీసులో కొందరు మిమ్మల్ని కోపానికి గురిచేయాలని చూసినా శాంతంగా వ్యవహరించడం మంచిది.

తులా రాశి: Oct 08 Horoscope | ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఖాళీ సమయాన్ని సమాజ సేవకు కేటాయించడం వల్ల అమితమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇవాళ హాజరయ్యే మీటింగ్‌లు, సెమినార్లు మీ కెరీర్‌లో ఎదగడానికి కొత్త మార్గాలు చూపుతాయి.

వృశ్చిక రాశి: Oct 08 Horoscope | స్నేహితులకు అప్పు ఇచ్చే ముందు ఆలోచించండి, మీ ఆర్థిక స్థితిని ఇబ్బందుల్లో నెట్టుకోవద్దు. దూరపు బంధువుల నుంచి వచ్చే ఒక అనుకోని శుభవార్త కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. వ్యాపారంలో ప్రతి లావాదేవీని దగ్గరుండి నిశితంగా గమనించడం మంచిది.

ధనుస్సు రాశి: రోజంతా ఆర్థికంగా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, సాయంత్రానికి లాభాలు అందుతాయి. ఇంట్లో ప్రశాంతత కోసం అందరి సహకారంతో పనులు పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. కళలు, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి తమ ప్రతిభను చాటుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి.

మకర రాశి: కుటుంబ సభ్యులతో వివాదాలు రాకుండా చూసుకోండి, ధన నష్టం జరిగే ప్రమాదం ఉంది. వ్యక్తిగత రహస్యాలను ఇతరులతో పంచుకునే ముందు ఆలోచించడం ఎంతో అవసరం. రోజువారీ బిజీ జీవితం నుంచి ఉపశమనం పొంది మీ కోసం తగినంత సమయం కేటాయించుకుంటారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

కుంభ రాశి: ఇవాళ మీరు ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. పిల్లల విజయం వల్ల నలుగురిలో గౌరవంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ అవసరాలకు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఆఫీసులో మీరు ధైర్యంతో తీసుకునే నిర్ణయాలకు గాను అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.

మీన రాశి: ఇవాళ తొందరపడి ఎలాంటి కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది. నాలుగురిలో ఉన్నప్పుడు మీ మాట తీరుపై నిగ్రహం వహించండి, విమర్శలు రాకుండా చూసుకోండి. బిజీ లైఫ్ నుంచి ఉపశమనం పొంది, ఖాళీ సమయాన్ని సృజనాత్మక పనులకు కేటాయిస్తారు. వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా తెలివిగా పరిష్కరించుకుంటారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *