అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Waterlogged Roads | రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో (Nizamabad Rains) రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. ప్రధాన రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
Nizamabad Waterlogged Roads | కలెక్టరేట్ చౌరస్తా వద్ద..
నగరంలోని ప్రధాన కూడలి అయిన కలెక్టరేట్ చౌరస్తా అమరవీరుల స్తూపం వద్ద రోడ్డుపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు(Traffic Disruption) ఇబ్బందులు పడ్డారు. ఈ నీళ్ల కారణంగా గుంతలు ఎక్కడో ఉన్నాయో తెలియక పాదచారులు సైతం అవస్థలు ఎదుర్కొన్నారు. అలాగే రైల్వేకమాన్ వద్ద.. పూలాంగ్ చౌరస్తా వద్ద సైతం వర్షం కారణంగా రోడ్లు పూర్తిగా శిథిలమయ్యాయి. అలాగే నగరంలోని కొన్ని శివారు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు నీటితో నిండిపోయాయి. రోడ్లు జలమయం కావడంతో మురికి కాలువలు, రోడ్లు ఏవో తెలియక కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ‘ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి కనీసం జాబ్ అప్లికేషన్ నింపడం కూడా రాదు’ – సీఎం రేవంత్ రెడ్డి