అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Rally | ఏఐ సంబంధిత స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో ప్రపంచ మార్కెట్లు భారీ సెల్లాఫ్‌కు గురవుతున్నా.. భారత దలాల్ స్ట్రీట్‌లో మాత్రం దీపావళి సందడి కొనసాగుతోంది. ప్రధాన సూచీలు వరుసగా ఏడో సెషన్లోనూ లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఇది గతేడాది నవంబర్ తర్వాత అత్యంత సుదీర్ఘమైన ర్యాలీ కావడం గమనార్హం.
Stock Market Rally | మన మార్కెట్లు ఎందుకు రాణిస్తున్నాయంటే..
అమెరికా మార్కెట్లలో నెలకొన్న భారీ పతనం నేడు చాలా ఇతర మార్కెట్లపై ప్రభావం చూపుతుంది, కానీ భారత ఈక్విటీ మార్కెట్లోని బెంచ్ మార్క్ సూచీýపై దీని ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మన మార్కెట్లలో పెట్టుబడులు పెడుతుండడం, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు వంద డాలర్ల దిగువకు దిగిరావడం వంటి కారణాలతో మన మార్కెట్లు రాణిస్తున్నాయి. అయితే ప్రధాన సూచీలు రాణిస్తున్నా.. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
Stock Market Rally | ఫ్లాట్ గా ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 103 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమైనా అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలతో అక్కడినుంచి 397 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ ఫ్లాట్‌గా ప్రారంభమై 150 పాయింట్లు కోల్పోయింది. ఇంట్రాడే కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 1,028 పాయింట్లు, నిఫ్టీ 314 పాయింట్లు ఎగబాకాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 467 పాయింట్ల లాభంతో 79,777 వద్ద, నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 24,622 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 17 స్టాక్స్ లాభాలతో, 13 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. ఎం అండ్ ఎం 4.04 శాతం, టైటాన్ 2.56 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.78 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.45 శాతం, సన్‌ఫార్మా 1.21 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : పవర్‌గ్రిడ్ 2.22 శాతం, బీఈఎల్ 1.75 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.71 శాతం, ఆసియన్ పెయింట్ 1.40 శాతం, ఇండిగో 1.11 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Smartphone Price Hike | స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. 30 శాతం వరకు పెరగనున్న మొబైల్ ఫోన్ల ధరలు