అక్షరటుడే, అందోల్: ఈ దీపావళి తెలంగాణ ప్రజల జీవితాల్లో నిజమైన కొత్త వెలుగులు నింపిందని, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం పేద బడుగు బలహీన వర్గాలలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపిందని అందోల్-జోగిపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) అన్నారు. జీవితంలో తమకంటూ సొంత ఇల్లు ఉండాలనే కల సాకారమవుతుండటంతో నిరుపేదలు తమ స్వశక్తిపై బ్రతికే భరోసాను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కల్పిస్తోందని ఆయన తెలిపారు.
తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు అందజేస్తున్న ఈ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ప్రజల జీవితాల్లో సంతోషం వెల్లివిరుస్తోందని కొనియాడారు. ఈ దీపావళి పండుగను ఇందిరమ్మ ఇళ్లలో జరుపుకోవాలని, యావత్ తెలంగాణ ప్రజల ఇళ్లలో సుఖసంతోషాలు నిండాలని వైస్ ఛైర్మన్ చిట్టిబాబు ఆకాంక్షించారు. అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.