అక్షరటుడే,నిజామాబాద్ క్రైం: Police Sports Meet | తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. నగరంలో క్రీడలు నిర్వహించే పలు ప్రాంతాలను ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు.
Police Sports Meet | సమన్వయంతో పని చేయాలి
జానకంపేటలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించిన సీపీ క్రీడాకారుల బస కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వసతి గదులు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలను సమకూర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఆతిథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే పూర్తి చేయాలని , ప్రతి విభాగానికి ప్రత్యేక బాధ్యతలు కేటాయించి సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026ను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా సమగ్ర ఏర్పాట్లు చేస్తోందని పోలీస్ కమిషనర్ తెలిపారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీటీసీ ఏసీపీ రాజశేఖర్ , బోధన్ రూరల్ సీఐ విజయబాబు, రుద్రూర్ సీఐ కృష్ణ, బోధన్ ఎస్హెచ్వో వెంకట్ నారాయణ, ఎడపల్లి ఎస్సై రమ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Dhanvantari Jayanti Celebrations | ప్రభుత్వ వైద్యకళాశాలలో ఘనంగా ధన్వంతరి జయంతి