Dhanvantari Jayanti Celebrations | ప్రభుత్వ వైద్యకళాశాలలో ఘనంగా ధన్వంతరి జయంతి

నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో భగవాన్ ధన్వంతరి జయంతి ఘనంగా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Dhanvantari Jayanti Celebrations | నిజామాబాద్(Nizamabad) నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో(Nizamabad Medical College) భగవాన్ ధన్వంతరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆయుష్ ఇన్​ఛార్జి డాక్టర్ గంగాదాస్ ఆధ్వర్యంలో ధన్వంతరి విగ్రహానికి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్ పూలమాల వేశారు.

Dhanvantari Jayanti Celebrations | క్షీరసాగర మదనంలో..

డాక్టర్ గంగాదాస్ మాట్లాడుతూ దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించినప్పుడు చివరిగా చేతిలో అమృత కలశంతో ధన్వంతరి శ్రీమహావిష్ణువు అవతారంలో ఆవిర్భవించారని తెలిపారు. ఆయుర్వేద వైద్యానికి అధిపతి, దేవతల వైద్యుడైన ధన్వంతరి జయంతిని ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత డాక్టర్ డీఎల్​ఎన్​ స్వామి, ఆయుర్వేద వైద్యులు శ్రీవాణి, జ్యోత్స్న, అర్వింద్​, విజయభాస్కర్, రామకృష్ణ, ఉమా, ఆర్​బీఎస్​కే ఎన్ఆర్​హెచ్ఎం డీపీఎం వందన, ఆయుష్ ఫార్మసిస్ట్ న్యావనంది పురుషోత్తం, సామాజిక కార్యకర్తలు కొట్టు రమేష్, రాజేందర్, శ్రీనివాస్ గౌడ్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: దివాళీ వేడుకల్లో కృతి సనన్ స్టైలిష్​ లుక్​.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *