అక్షరటుడే, వెబ్డెస్క్: Adulterated Milk | హైదరాబాద్ (Hyderabad) నగరంలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. ప్రతి దానిని కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది.
తమ లాభాల కోసం ప్రమాదకరమైన రసాయనాలతో ఆహార పదార్థాలు తయారు చేస్తోంది. చివరకు పాలను కూడా కల్తీ చేసి విక్రయాలు చేపడుతోంది. తాజాగా కల్తీ పాల తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు సోదాలు చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్పూర్ పాలపొడి కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
Adulterated Milk | నిందితుడి అరెస్ట్
ఈ పాలను హైదరాబాద్ వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. పాల వ్యాపారి అండే శ్రీశైలం(43)ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 100 లీటర్ల కల్తీ పాలు, లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 35 ధోల్పూర్ పాలపొడి ప్యాకెట్లు సీజ్ చేశారు. నిందితుడు పోచారం గ్రామంలో నివాసం ఉంటూ పాల వ్యాపారం చేస్తున్నాడు. గ్రామంలో కల్తీ పాలు తయారు చేసి, నగరంలోని పలు ప్రాంతాలకు వాటిని సరఫరా చేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Water Crisis | హైదరాబాద్లో నీటి కష్టాలు.. ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్