Hyderabad Water Supply | నల్లాలకు మోటార్లు పెడితే కఠిన చర్యలు : జలమండలి

నల్లాలకు మోటార్లు పెట్టే వారిపై జలమండలి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Water Supply | హైదరాబాద్​ నగరంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి (HMWSSB) అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. నీటిని దుర్వినియోగం చేస్తున్న వారికి జరిమానా వేస్తున్నారు. అలాగే అక్రమంగా నల్లాలకు మోటార్లు పెడితే సీజ్​ చేస్తున్నారు.

నగరంలోని కుత్బుల్లాపూర్ జోన్‌లోని శ్రీరామ్‌నగర్ ప్రాంతం, డివిజన్-23, పద్మనగర్ వార్డులో విజిలెన్స్​ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. తాగునీటి సరఫరా లైన్లకు అక్రమంగా అమర్చిన నాలుగు మోటార్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కుళాయిలకు అక్రమంగా మోటార్లను అమరిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదేపదే ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి రూ.5,000 జరిమానా విధించడంతో పాటు, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు.

Hyderabad Water Supply | ప్రజలు సహకరించాలి

నల్లాలకు మోటార్లు పెడితే ఇతరులకు నీటి పంపిణీలో అంతరాయం కలుగుతుందని జలమండలి పేర్కొంది. వినియోగదారులు కుళాయిలకు మోటార్లను అమర్చవద్దని కోరింది. ఒకవేళ తక్కువ ప్రెజర్​తో నీళ్లు వస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఫిర్యాదులు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.

దీనిని కూడా చదవండి : Sonam Wangchuk | ఆ హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్​చుక్​ లేఖ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *