Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్​ నగరంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Houses | పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో గోడు వినేవారు లేరని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్నామని చెప్పారు.

గాంధీభవన్ (Gandhi Bhavan)​లో బుధవారం నిర్వహించిన మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో పొంగులేటి పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఎక్కడైతే పేద‌లు నివాసం ఉంటున్నారో, అప్రాంతానికి సమీపంలోనే ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలన్న ఆలోచ‌న‌తో 16 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇందిర‌మ్మ ఇండ్ల ట‌వ‌ర్స్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పుడు నిర్మించ‌బోయే ఆ ఇండ్ల స్థలాల విలువ సుమారు రూ. 40 లక్షల నుంచి కోటి రూపాయిల వ‌ర‌కు ఉంటుందని తెలిపారు. గ‌తంలో ఇందిర‌మ్మ ఇండ్ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ వారు కూడా ఇప్పుడు మీ సేవ, వాట్సాప్‌, వెబ్‌సైట్ ద్వారా మ‌రోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Indiramma Houses | సమస్యలు పరిష్కరించాలి

గాంధీ భవన్​లో ప్రజల నుంచి అర్జీలను సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్ణీత గడువులోగా పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడుతారని మంత్రి భరోసా ఇచ్చారు. ప‌దేళ్ల బిఆర్ఎస్ పాల‌న‌లో ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకోవ‌డానికి అవ‌కాశం ఉండేదికాదన్నారు. మంత్రులు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేవారు కాదని తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా ప్రభుత్వం నేరుగా వారి వద్దకు చేరుకోవాలన్న సంకల్పంతో “ప్రజలతో మంత్రుల ముఖాముఖి” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

దీనిని కూడా చదవండి : REDCO DE | రెడ్కో డీఈ నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భార్య పేరిట భారీగా ఆస్తులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *