MRI Scanning | మరో 9 ఆస్పత్రుల్లో ఎంఆర్ఐ సేవలు : మంత్రి రాజనర్సింహ

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: MRI Scanning | ప్రభుత్వ హాస్పిటళ్లలో ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సేవలను మరింత విస్తరిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. కొత్తగా 9 ఎంఆర్ఐ యంత్రాలు, 8 సీటీ స్కాన్ యంత్రాలను ప్రభుత్వ హాస్పిటళ్లలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

శాసన మండలిలో గురువారం ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్స్‌లో 9 ఎంఆర్ఐలు, 50 సీటీ స్కాన్ యంత్రాలు, 1,770 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్‌, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌, ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్‌లో ఎంఆర్ఐ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొత్తగా నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రులతో పాటు నీలోఫర్ హాస్పిటల్​లో ఎంఆర్ఐ సేవలను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు చెప్పారు.

MRI Scanning | గాంధీకి పెరుగుతున్న రోగులు

గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి (Damodar Rajanarsimha) తెలిపారు. దీంతో రోగుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. దీంతో ఆ హాస్పిటల్స్​లో అక్కడ అదనపు ఎంఆర్ఐ యంత్రాలను ఏర్పాటు చేతామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 1,770 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన చోట అదనంగా 485 వెంటిలేటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. వైద్య పరికరాల పనితీరు, వర్కింగ్ కండీషన్, నిర్వహణ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు టీజీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.

ఇది కూడా చదవండి..: Revanth Reddy Countdown | రేవంత్​రెడ్డికి కౌంట్​డౌన్​ మొదలైంది : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *