Tata Madhu Dismissal | తాతా మధును డిస్మిస్​​ చేయాలి : సీఎం రేవంత్​ రెడ్డి

బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ తాతా మధును డిస్మిస్​ చేయాలని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tata Madhu Dismissal | బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ తాతా మధును డిస్మిస్​ చేయాలని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.

తాతా మధు స్పీకర్​ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభాపతి పీఠం గౌరవాన్ని దిగజార్చేలా మాట్లాడటం సభ్య సమాజానికే అవమానం అన్నారు. సభాపతిపై వ్యాఖ్యలు క్షమించరాని నేరం అని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను సహించబోమని, ఇది తీవ్రమైన నేరమని పేర్కొన్నారు.

Tata Madhu Dismissal | కేసీఆర్​ క్షమాపణ చెప్పాలి

ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఆదివారం ఫామ్​హౌజ్​లో సమావేశం ఏర్పాటు చేసి భాష గురించి మాట్లాడారని సీఎం అన్నారు. అసెంబ్లీలో అభ్యంతరకరమైన భాషను ప్రయోగిస్తున్నారు.. అందుకే అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని అంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభాపతిని అవమానకరంగా మాట్లాడితే, అది మాకు అందరికీ జరిగిన అవమానంగా భావిస్తామన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్ కుమార్‌పై తాతా మధు చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. తాతా మధుతో రాజీనామా చేయించి సస్పెండ్ చేయాలని అన్నారు.

Tata Madhu Dismissal | అవసరాల కోసం వాడుకున్నారు

బీఆర్‌ఎస్ పార్టీ పుట్టుక కోసం, రాజకీయాల కోసం, ఎన్నికల్లో గెలుపు కోసం దళితులను వాడుకున్నారని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న దళిత నాయకుడిని బర్తరఫ్ చేసిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు. ఉద్యమ సమయంలో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడైన విద్యావేత్తను తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా ఎన్నుకుందన్నారు. అలాంటి నాయకుడిని అవమానించడం సరికాదన్నారు.

ఇది కూడా చదవండి..: Hijra Mafia | హిజ్రా మాఫియా వెనక కాంగ్రెస్ హస్తం : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *