Alternative Crops | వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: కలెక్టర్​ గరిమా అగ్రవాల్​

ఎల్​నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్నసిరిసిల్ల: Alternative Crops | ఎల్​నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్  (Collector Garima Agrawal) సూచించారు. రుద్రంగి మండలం మానాలలో కేతు బచావో అభియాన్, రైతు నేస్తం కార్యక్రమాలు మంగళవారం నిర్వహించగా గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Alternative Crops | రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు..

కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సూపర్ ఎల్​నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు రైతులు వరి సాగు చేయవద్దని సూచించారు. రిజర్వాయర్లలోని నీటిని తాగు నీటికి, జీవాల కోసం వినియోగించాలని తెలిపారు. భూగర్భ జలాలు గత ఏడాది తో పోలిస్తే ఇంకా లోతులోకి పడిపోయాయని తెలిపారు. వరి సాగు చేస్తే నీరు బారీగా అవసరమని వెల్లడించారు. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పొడి ఎండ వాతావరణంతో రాను రాను రాను భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని వివరించారు.

Alternative Crops | మానాలు రైతులు సాగులో ఆదర్శం..

మానాల రైతులు సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారని, గత సీజన్​లో ప్రత్యామ్నాయ పంటల సాగులో ముందున్నారని అభినందించారు. ప్రస్తుత సూపర్ ఎల్​నినో ప్రభావంతో రైతులు నువ్వులు, వేరుశనగ, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, ఆయిల్ పామ్ సాగు చేయాలని పిలుపునిచ్చారు. వీటి సాగుకోసం డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు వాడి నీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయిల్ ఫామ్ కు టన్ను ధర ప్రస్తుతం 22 వేల 658 ఉందని వెల్లడించారు అలాగే జిల్లాకు దగ్గర్లోనే సిద్దిపేటలో జిల్లాలో ఆయిల్ ప్లాన్ ఫ్యాక్టరీ ఉందని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెలుకల తిరుపతి, మండల ప్రత్యేక అధికారి, జిల్లా ప్రణాళిక శాఖ అధికారి సంపత్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహశీల్దార్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Alternative Crops for Farmers | ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *