అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mallareddy Farmhouse | చెరువుల ఆక్రమణలపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా దూలపల్లిలో ఫాక్స్ సాగర్ పరిధిలో ఆక్రమణలను తొలగించింది. మాజీ మంత్రి మల్లారెడ్డి ఫామ్‌హౌస్ ప్రహరీని సైతం కూల్చివేసింది.
ఫాక్స్ సాగర్ పునరుద్ధరణకు హైడ్రా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఇటీవల స్థానికులతో సమావేశం సైతం నిర్వహించింది. తాజాగా ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఆక్రమణలపై చర్యలు చేపట్టింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఏకంగా అర కిలోమీటరు మేర బండ్ నిర్మించడంతో సోమవారం కూల్చివేసింది. ఆ బండ్‌ను హద్దుగా ఫామ్ హౌస్ నిర్మాణానికి గాను కట్టిన ప్రహరీని హైడ్రా కూల్చి వేసింది. కొన్ని చోట్ల హద్దుగా వేసిన ఇనుప కంచెను కూడా తొలగించింది.
Mallareddy Farmhouse | ఎఫ్టీఎల్లో ప్రహరీ నిర్మాణం
ఫాక్స్ సాగర్‌కు మరోవైపు ఎఫ్‌టీఎల్ పరిధిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఫామ్ హౌస్ ప్రహరీని కూడా హైడ్రా కూల్చివేసింది. ఎఫ్‌టీఎల్, బఫర్ పరిధిలో మట్టిని నింపి ప్రహరీ నిర్మించి.. గేటు ఏర్పాటు చేశారు. హైడ్రా వాటిని తొలగించింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో మల్లారెడ్డి కుటుంబీకులకు సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది. దాదాపు 15 ఎకరాల వరకూ ఫాక్స్ సాగర్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి జరిగి మల్లారెడ్డి కుటుంబీకులు ప్రహరీ నిర్మించినట్టు తేలింది. జీడిమెట్ల సర్వే నంబరు 41, 42లలో దాదాపు 20 ఎకరాల మేర ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో వచ్చిన ప్రహరీని కూడా హైడ్రా తొలగించింది.
దీనిని కూడా చదవండి : Traffic-Free City | హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చాలి : సీఎం రేవంత్‌రెడ్డి