అక్షరటుడే, వెబ్డెస్క్ : Joint Land Survey | ఉమ్మడి సర్వేతో రెవెన్యూ, ఫారెస్ట్ భూముల సరిహద్దు వివాదాలకు చెక్ పడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (minister ponguleti) అన్నారు. సచివాలయంలో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఏళ్లుగా రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల మధ్య భూమి సరిహద్దు విషయంలో వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఉమ్మడి సర్వే చేపట్టాలని నిర్ణయించింది. దీనిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సామాన్య ప్రజలు, రైతులకు నష్టం జరగకుండా సమన్వయంతో జాయింట్ సర్వేలు నిర్వహించాలని ఆదేశించారు.
Joint Land Survey | ఆధునిక పరిజ్ఞానంతో..
అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పద్ధతుల సహాయంతో సర్వే నిర్వహించాలని మంత్రి సూచించారు. భూములకు స్పష్టమైన సరిహద్దులను గుర్తించి, భవిష్యత్లో భూ వివాదాలు తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లా, మండల స్థాయిలో రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భూ రికార్డులలో పూర్తి పారదర్శకత, ఖచ్చితత్వం తీసుకవచ్చి దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
దీనిని కూడా చదవండి : Amit Shah Hyderabad Rally | అమిత్ షా మహా పాదయాత్రలో ఎమ్మెల్యే ధన్పాల్