Illegal Water Business | అక్రమ నీటి దందాపై చర్యలు.. ఏడు బోర్లు పూడ్చివేత

హైదరాబాద్​ నగరంలో అక్రమ నీటిదందాపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Illegal Water Business | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో అక్రమ నీటిదందాపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అనుమతులు లేకుండా బోర్లు వేసి, ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపడుతోంది.

నగరంలో భూగర్భ జలాలు కాపాడటం కోసం అక్రమంగా వేసిన బోర్లను హైడ్రా (Hydraa) పూడ్చివేస్తోంది. ఇటీవల సున్నం చెరువు, తుమ్మిడికుంటలో బోర్లు ధ్వంసం చేసిన హైడ్రా తాజాగా.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ గ్రామంలో తనిఖీలు చేపట్టింది. 7 బోర్ల‌ను పైపుల‌తో స‌హా తొల‌గించి పూడ్చింది. అలాగే 6 వాట‌ర్ సంపుల‌ను ధ్వంసం చేసింది. వాట‌ర్ ట్యాంకుల‌ను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేయించింది. తెల్లాపూర్​లో పలువురు అక్రమంగా బోర్లు వేసి, వాటిని ట్యాంకర్ల ద్వారా విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో హైడ్రా చర్యలు చేపట్టింది.

దీనిని కూడాచదవండి : Mallareddy Farmhouse | మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి ఫామ్​హౌస్ ప్ర‌హ‌రీ కూల్చివేత‌

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *