అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR Warning | ఇప్పుడు రెచ్చిపోయే నాయకులు, అధికారులను వదిలిపెట్టమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి పని చెబుతామన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఆదివారం కేటీఆర్ పర్యటించారు. పలువురు నాయకులు ఆయన సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే పార్టీ మారినా క్యాడర్ మాత్రం బీఆర్ఎస్‌తోనే ఉన్నారన్నారు. రాజేంద్రనగర్‌లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాశ్ గౌడ్ అనంతరం కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.
KTR Warning | ప్రజల గుండెల్లో కేసీఆర్
గత 15 రోజులుగా ఒకాయనకు నిద్రపట్టట్లేదని కేటీఆర్ అన్నారు. పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్ పాటలు పెట్టొద్దన్నారని విమర్శించారు. అయినా కేసీఆర్‌పై జనాలకు అభిమానం ఏ మాత్రం తగ్గలేదన్నారు. ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారని పేర్కొన్నారు. మళ్లీ కేసీఆర్ ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారని చెప్పారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు చేశారు. నీళ్లు ఉండి కూడా ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30శాతం కమీషన్లు తీసుకుంటూ రియల్ ఎస్టేట్‌ను నాశనం చేశారని ఆరోపించారు.
KTR Warning | శంషాబాద్‌కు మెట్రో వచ్చేది
కేసీఆర్ సీఎంగా ఉండి ఉంటే ఇప్పటి వరకు శంషాబాద్‌కు మెట్రో వచ్చేదని కేటీఆర్ అన్నారు. తమ హయాంలో టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎయిర్‌పోర్ట్ మెట్రో రద్దు చేశారన్నారు. రెండేళ్లలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు రెచ్చిపోయే వాళ్లను వదిలిపెట్టమన్నారు. వానపాములు కూడా బుసలు కొడుతున్నాయని పేర్కొన్నారు. టైమ్ వచ్చినప్పుడు ఎవ్వరినీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.
మీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పని కూడా అయిపోయింది
మోసం చేసి రేవంత్ రెడ్డి పక్కన చేరాడు
ఘన్సిమియా గూడ భూముల కోసమా, సుల్తాన్పూర్ కోసమా? దేని కోసం పోయావో మాకు తెలియదు అనుకుంటున్నావా?
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లుచ్చా పనులు చేస్తున్న ఎవరిని వదిలిపెట్టము
– కేటీఆర్ pic.twitter.com/0YwRZkpN4o
— Telugu Scribe (@TeluguScribe) September 27, 2026
దీనిని కూడా చదవండి : Footpath Encroachments | 238 ఆక్రమణలను తొలగించిన అధికారులు