అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Footpath Encroachments | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) అధికారులు శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 238 ఆక్రమణాలను తొలగించారు.
నగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. దీంతో ప్రమాదాలు సైతం ఎక్కువ అవుతున్నాయి. మరోవైపు ఫుట్‌పాత్‌లను ఆక్రమించి పలువురు వ్యాపారాలు చేస్తున్నారు. చిరు వ్యాపారులతో పాటు పెద్ద పెద్ద దుకాణాదారులు సైతం ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తున్నారు. దీంతో ప్రజలు రోడ్లపై నడుస్తుండటంతో వాహనదారులకు మరింత ఇబ్బంది అవుతోంది. ఈ క్రమంలో కొంతకాలంగా జీహెచ్ఎంసీ, సీఎంసీ అధికారులు ఆక్రమణల తొలగింపు కోసం చర్యలు చేపట్టారు.
Footpath Encroachments | వాక్-ఫ్రీ డ్రైవ్‌లో భాగంగా..
వాక్-ఫ్రీ డ్రైవ్‌లో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 14.4 కిలోమీటర్ల రహదారి నుండి 238 అక్రమ అడ్డంకులను తొలగించారు. కుత్బుల్లాపూర్ మండలంలో 93, సెరిలింగంపల్లి మండలంలో 87, కూకట్‌పల్లి మండలంలో 58 తొలగింపులు నమోదయ్యాయి. నార్సింగి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, మియాపూర్, కూకట్‌పల్లి, మూసాపేట్, మాదాపూర్, ఆల్విన్ కాలనీ, చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గాజులరామారం, నిజాంపేట్, దుండిగల్, మేడ్చల్‌లోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ జరిగింది. ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఆక్రమణలు తొలగించిన ప్రాంతాలు తిరిగి ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షిస్తామన్నారు.
దీనిని కూడా చదవండి : LPU student protests | రణరంగంగా మారిన పంజాబ్ యూనివర్సిటీ