అక్షరటుడే, వెబ్‌డెస్క్: HYDRAA Commissioner | హైడ్రా (Hydraa) కమిషనర్ ఎవి రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (CS) ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రంగనాథ్‌పై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉండటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులను ఆశ్రయించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, బాధ్యతాయుతమైన ఉన్నతాధికారిగా ఉండి కోర్టు ఉత్తర్వులను ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని ఆక్షేపించింది.
HYDRAA Commissioner | ఆదేశాలను ఉల్లంఘించిందంటూ..
మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంట భూములకు సంబంధించి గతంలో హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన ఆదేశాలను హైడ్రా ఉల్లంఘించిందంటూ శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, అక్కడి ఫెన్సింగ్‌ను హైడ్రా సిబ్బంది తొలగించారని పిటిషన్‌లో పేర్కొంది. ఒకే అంశానికి సంబంధించి పలుమార్లు కోర్టు ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ ఉల్లంఘించడం నేరమని హైకోర్టు మండిపడింది. ఈ నేపథ్యంలో విచారణకు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
HYDRAA Commissioner | క్షమాపణలు కోరిన రంగనాథ్..
ఈ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (AG) జోక్యం చేసుకుంటూ, దీనిపై పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. ఆ అఫిడవిట్‌లో కమిషనర్ రంగనాథ్ బేషరతుగా క్షమాపణ కోరారు. కోర్టుల పట్ల తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంటూ.. లోతుకుంట సర్వే నంబర్ 1, 2 పరిధిలోని 40 ఎకరాల భూమిలోకి తాము వెళ్లలేదని తెలిపారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం.. రంగనాథ్‌పై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉండటానికి అసలు కారణం ఏమిటని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. అధికారుల తీరు మారకపోవడాన్ని తప్పుబట్టిన హైకోర్టు.. తక్షణమే రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించి, ఆ స్థానంలో మరొకరిని నియమించాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను పదవి నుంచి తప్పించండి: హైకోర్టు
TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఉత్తర్వులను ఒక ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరైన పద్ధతి కాదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆయనను హైడ్రా కమిషనర్ పోస్టు… pic.twitter.com/Fhc8obKJlW
— Akshara Today | Telugu News (@aksharatoday) July 27, 2026
ఇది కూడా చదవండి..: Yashaswini Reddy | యశస్వినీ రెడ్డిని విద్యాశాఖ మంత్రి చేయాలి : బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు