Kodad SI Suspended | కోదాడ రూరల్​ ఎస్సైపై వేటు

సూర్యాపేట జిల్లాలో కోదాడ రూరల్ ఎస్‌ఐ గోపాల్‌పై వేటు పడింది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kodad SI Suspended |సూర్యాపేట (Suryapet) జిల్లాలో కోదాడ రూరల్ ఎస్‌ఐ గోపాల్‌పై వేటు పడింది. ఈ మేరకు పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Kodad SI Suspended |డిప్యూటీ సీఎం ఫిర్యాదుతో..

ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కాన్వాయ్‌ను షెడ్యూల్ రూట్​లో కాకుండా మరో మార్గంలో ఎస్సై గోపాల్​ తీసుకెళ్లారు. ఈ ఘటనపై డీజీపీకి స్వయంగా డిప్యూటీ సీఎం ఫిర్యాదు చేశారు. జోనల్-2 ఐజీ, సూర్యాపేట ఎస్పీలను వివరణ కోరారు. ఎస్సై వ్యవహారంపై డిప్యూటీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎస్సై గోపాల్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది.

దీనిని కూడా చదవండి : Telangana Heavy Rains | రైతులకు గుడ్​న్యూస్.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *