అక్షరటుడే, వెబ్‌డెస్క్: Yogi Adityanath Tirumala | తిరుమల శ్రీవారిని సోమవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు.
కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి దర్శనం చేసుకొన్న యోగికి అధికారులు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.
Yogi Adityanath Tirumala | యోగిని కలిసిన టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు
ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్‌ను టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీవారి ఆశీస్సులతో దేశ ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని వారు ఆకాంక్షించారు.
National Film Awards | నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు కొత్త వేదిక.. తొలిసారి ఢిల్లీ వెలుపల నిర్వహణ
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్ తిరుమల పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.