Vijay Political Comments | నేను నటుడినే.. కానీ, మీరే అసలైన రాజకీయ నటులు : ప్రత్యర్థులపై దళపతి విజయ్ ఫైర్

Naresh Chandan
Vijay Political Comments

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vijay Political Comments | తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత, దళపతి విజయ్ చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. “నేను నటుడినే, కానీ మీరే అసలైన నాటకాలు ఆడుతున్నారు!” అంటూ ప్రత్యర్థులపై ఆయన చేసిన కామెంట్​ చర్చకు దారితీసింది.

Vijay Political Comments | ఘాటు వ్యాఖ్యలు..

ప్రచారంలో భాగంగా విజయ్ మాట్లాడుతూ.. “నన్ను పదే పదే నటుడు అని అంటున్నారు. అవును, నేను నటుడినే. అందులో కొత్త విషయం ఏముంది? నేను నటుడినని మీరిప్పుడు కనిపెట్టారా?” అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సినిమా రంగం నుంచి వచ్చిన తనకు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని తక్కువ చేసి చూడవద్దని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Vijay Political Comments | రాజకీయాల్లో నాటకాలు మీవి.. నావి కావు!

రాజకీయాల్లో తన నిజాయితీని ప్రశ్నిస్తున్న అధికార పక్ష నేతలపై విజయ్ విరుచుకుపడ్డారు. “నేను సినిమాల్లో నటిస్తాను.. అయితే, రాజకీయాల్లోకి వచ్చాక నటించడం లేదు. ప్రజల కోసం నిజాయితీగా పని చేయడానికే వచ్చాను. కానీ, మీరు మాత్రం రాజకీయాల్లోనే నాటకాలు ఆడుతున్నారు. పూటకో మాట మారుస్తూ ప్రజలను వంచిస్తున్న మీ కంటే పెద్ద నటులు ఎవరైనా ఉంటారా..?” అని ఆయన ఎద్దేవా చేశారు.

Vijay Political Comments | ఎన్నికల సమరానికి సై..

తమిళనాడు ఎన్నికలకు కేవలం రెండు రోజులే సమయం ఉండటంతో విజయ్ తన ప్రసంగాల్లో వేడి పెంచారు. ఏ కూటమితోనూ పొత్తు పెట్టుకోకుండా టీవీకే పార్టీ 234 స్థానాల్లో బరిలోకి దిగింది.

కరూర్ తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం తీరును ఎండగట్టడంతో పాటు, డీఎంకే ప్రభుత్వాన్ని ‘అల్టా మోడల్’ (ఏమీ లేని మోడల్) అంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. మహిళలకు నెలకు రూ. 2,500 సాయం, నిరుద్యోగులకు భృతి తదితర హామీలతో విజయ్ ప్రజల్లోకి వెళ్లారు.

సినిమాల్లో ‘జన నాయగన్’గా అలరించిన దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయ జీవితంలో ‘నాయకుడు’గా ఎంతవరకు మెప్పిస్తారో తెలియాలంటే మే 4వ తేదీన వెలువడే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి: Anasuya cyber harassment | నటి అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో వేధింపులు.. నిందితుడి అరెస్టు

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *