అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Police Transfers | రాష్ట్ర ప్రభుత్వం పలువురు పోలీస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) ఉత్తర్వులు చేశారు.
Police Transfers | డీఎస్పీ ఆనందరెడ్డి
ఇంటెలిజెన్స్ విభాగంలో డీఎస్పీ (DSP)గా కొనసాగుతున్న ఆనందరెడ్డిని నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీగా ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ రాజును సీఐడీ విభాగంలో డీఎస్పీగా బదిలీ చేశారు. సంబంధిత ఉన్నతాధికారులు వారిని వెంటనే రిలీవ్ చేయాలని డీజీపీ ఆదేశించారు. సదరు అధికారులు కొత్త పోస్టింగ్‌ల్లో రిపోర్టు చేయాలన్నారు. ఇటీవల సైతం పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు అయ్యాయి. తాజాగా మరోసారి బదిలీలు చేపట్టడం గమనార్హం.

ఇది కూడా చదవండి : CI & SI Caught by ACB | స్టేషన్ బెయిల్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్సై

