అక్షరటుడే వెబ్‌డెస్క్: Double Salary Scam | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ‘డబుల్ శాలరీ’ (రెండు జీతాలు) వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నకిలీ (డూప్లికేట్) ఆధార్ ( Aadhaar )నంబర్లను సృష్టించి దాదాపు 40 మంది ఉద్యోగులు అక్రమంగా రెండు జీతాలు తీసుకుంటున్నట్లు కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించింది. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించి, నకిలీ ఆధార్ మ్యాపింగ్‌లను ఏరివేసే పనిలో పడింది. అయితే, ఈ కేసులో తాజాగా మరో కొత్త కోణం తెరపైకి వచ్చింది.
Double Salary Scam | ఉద్యోగ సంఘాల సంచలన ఆరోపణలు..
కొందరు ఉద్యోగులు భారీ మొత్తంలో రెండు జీతాలు తీసుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. మంత్రులు, ముఖ్యనేతలు, ఉన్నతాధికారుల ఇళ్లలో పనిచేసే సిబ్బందికి జీతాలు చెల్లించేందుకే నకిలీ ఆధార్‌ల ద్వారా ఇలా డబుల్ శాలరీ ఇస్తున్నట్లు వారు కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా, ప్రొటోకాల్ ఖర్చుల నిమిత్తం కూడా ఈ నిధులను వాడుతున్నట్లు పేర్కొన్నారు. ఇదంతా ఆర్థిక శాఖ అధికారులకు పూర్తిగా తెలిసే జరుగుతోందని ఉద్యోగ సంఘాలు ఆరోపించడంతో ఈ అంశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా ధనాన్ని ఇలా సొంత అవసరాలు , ఇతర ఖర్చుల కోసం దుర్వినియోగం చేయడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా రెండు జీతాలు పొందుతున్న ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
ఇది కూడా చదవండి: FCRA Amendment Bill | ఎఫ్సీఆర్ఏ బిల్లును వ్యతిరేకిస్తాం : మల్లికార్జున్ ఖర్గే