అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lal Darwaza Bonalu | పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా సాగుతున్నాయి. భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా సింహవాహిని అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ (Konda Surekha), పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ వస్త్రాలు సమర్పించడం జరిగింది. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న ఆలయంలో అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీధర్‌బాబు పట్టు వస్త్రాలు సమర్పించారు.
Lal Darwaza Bonalu | ఈటల పూజలు
జగద్గిరిగుట్టలోని సంజైపురి కాలనీ, అంజయ్య నగర్లలో బోనాల వేడుకలకు ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) హాజరై అమ్మవారిని దర్శించుకుని , ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి బోనాల పండుగ నిదర్శనం అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సకల సంపదలతో సుభిక్షంగా ఉండాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మల్కాజిగిరిలోని సఫిల్‌గూడ శ్రీ కట్ట మైసమ్మ, లాలాపేట్‌లోని పోచమ్మ దేవాలయంలో పూజలు చేశారు.
Lal Darwaza Bonalu | ఆలయాలను దర్శించుకున్న కేటీఆర్
బోనాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పలు ఆలయాలను దర్శించుకున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారి, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
దీనిని కూడా చదవండి : North Korea Troops | ఉత్తర కొరియా నుంచి రష్యాకు 50వేల మంది సైనికులు?: జెలెన్స్కీ