North Korea Troops | ఉత్తర కొరియా నుంచి రష్యాకు 50వేల మంది సైనికులు?: జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా మరింత సైన్యాన్ని పంపుతోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Niger Road Accident | ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా మరింత సైన్యాన్ని పంపుతోంది. తాజాగా ఆ దేశం నుంచి మాస్కోకు ఏకంగా 50 వేల మంది సైనికులను పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. మొదట్లో వందల సంఖ్యలో ఉన్న కిమ్ సేనలు.. ఇప్పుడు వేల సంఖ్యకు చేరాయని తెలిపారు. రష్యా ఆధ్వర్యంలో ఆధునిక యుద్ధ తంత్రాలపై శిక్షణ పొందుతున్న ఈ సైనికులు, భవిష్యత్తులో ఇతర ఆసియా దేశాలకు కూడా ముప్పుగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

North Korea Troops | తమకు సహకరించాలని..

యుద్ధంలో అనుభవం గడించిన తర్వాత, రష్యా నుంచి లైసెన్సులు పొంది అన్ని రకాల సైనిక పరికరాలను సమకూర్చుకోవాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ వ్యూహరచన చేస్తున్నట్లు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణుల్లో ఉత్తర కొరియా తయారీవి కూడా ఉన్నట్లు తమ సైన్యం గుర్తించిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రష్యాను ఎదుర్కొనేందుకు తమకు సహకరించాలని దక్షిణ కొరియాను ఆయన కోరారు. ముఖ్యంగా గగనతల రక్షణ వ్యవస్థల (ఎయిర్ డిఫెన్స్) కొరతను ఎదుర్కొంటున్నామని, ఆ రంగంలో ఆ దేశం నుంచి మద్దతు ఆశిస్తున్నట్లు తెలిపారు.

North Korea Troops| సెర్బియాలో జెలెన్‌స్కీ పర్యటన..

యుద్ధంలో ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ మద్దతును కూడగట్టేందుకు జెలెన్‌స్కీ దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆయన సెర్బియాలో పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్‌తో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. యూరోపియన్ యూనియన్‌లో చేరాలనే ఉమ్మడి లక్ష్యం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఉక్రెయిన్‌కు మానవతా సహాయంతో పాటు మౌలిక సదుపాయాలు, ఇంధన రంగానికి అవసరమైన పరికరాలను అందించేందుకు సెర్బియా ప్రభుత్వం అంగీకరించింది.

ఇది కూడా చదవండి:  Niger Road Accident | నైజర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది సైనికులతో సహా 22 మంది మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *