Niger Road Accident | నైజర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది సైనికులతో సహా 22 మంది మృతి

పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్‌లో జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో 17 మంది సైనిక సిబ్బందితో పాటు మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Niger Road Accident | పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్‌లో జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో 17 మంది సైనిక సిబ్బందితో పాటు మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు బస్సులు ఎదురుగా వేగంగా వచ్చి ఒకదానినొకటి బలంగా ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మరో 37 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

Niger Road Accident | శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది..

ఇటీవలే తమ సైనిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న సిబ్బంది ప్యాసింజర్ బస్సులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

 

ఇది కూడా చదవండి:  Lal Darwaza Bonalu | ఘనంగా లాల్​దర్వాజ బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న విజయ్​ దేవరకొండ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *